Share News

శిక్ష అనంతరం ఖైదీలకు రుణాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:41 AM

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్ష అనంతరం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్‌ ట్రైనింగ్‌ కింద వివిధ శిక్షణలు అందిస్తాం. ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తాం’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హామీ ఇచ్చారు. స్థానిక జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప- స్కిల్‌ ట్రైనింగ్‌ కింద మల్టీ స్కిల్‌ ట్రేడ్‌ కింద శిక్షణ పొందిన వారికి కలెక్టర్‌ బుధవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఎలక్ర్టీషియన్‌, ప్లంబర్‌, ఏసీ మెకానిక్‌ వంటి వృత్తులవారు నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా సమాజంలో ఎదుగుతున్నారన్నారు.

శిక్ష అనంతరం ఖైదీలకు రుణాలు
శిక్షణ పొందిన ఖైదీలకు సర్టిఫికెట్లను అందించిన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

- కలెక్టర్‌ హామీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్ష అనంతరం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్‌ ట్రైనింగ్‌ కింద వివిధ శిక్షణలు అందిస్తాం. ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తాం’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హామీ ఇచ్చారు. స్థానిక జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప- స్కిల్‌ ట్రైనింగ్‌ కింద మల్టీ స్కిల్‌ ట్రేడ్‌ కింద శిక్షణ పొందిన వారికి కలెక్టర్‌ బుధవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఎలక్ర్టీషియన్‌, ప్లంబర్‌, ఏసీ మెకానిక్‌ వంటి వృత్తులవారు నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా సమాజంలో ఎదుగుతున్నారన్నారు. భవిష్యత్తులో ఖైదీలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌ సూచనలతో ఖైదీలకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 24వ తేదీవరకు వివిధ శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. జైలులో మహిళా ఖైదీలు ఉన్నారని, వారికి టైలరింగ్‌ వృత్తిలో శిక్షణ అందిస్తే భవిష్యత్తులో ఉపాధి కల్పించినట్లు అవుతుందని కలెక్టర్‌ను కోరారు. త్వరలో ఓపెన్‌ క్లాస్‌ ద్వారా పదో తరగతి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధిశాఖ అధికారి గుణశేఖర్‌రెడ్డి, న్యాక్‌ ఏడీ సతీష్‌, జైలు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 02:41 AM