Share News

రూ.3.50 కోట్లకు వడ్డీవ్యాపారి ఐపీ దాఖలు

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:46 AM

చిత్తూరుకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి రూ.3.50 కోట్లకు ఐపీ దాఖలు చేశాడు. చిత్తూరు న్యూబాలాజీ కాలనీలో నివాసముంటున్న ఓఎం నందకుమార్‌ పలు వ్యాపారాల నిమిత్తం తెలిసిన 105 మంది వద్ద రూ.3.50 కోట్లు తీసుకున్నాడు.

రూ.3.50 కోట్లకు వడ్డీవ్యాపారి ఐపీ దాఖలు

చిత్తూరు లీగల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): చిత్తూరుకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి రూ.3.50 కోట్లకు ఐపీ దాఖలు చేశాడు. చిత్తూరు న్యూబాలాజీ కాలనీలో నివాసముంటున్న ఓఎం నందకుమార్‌ పలు వ్యాపారాల నిమిత్తం తెలిసిన 105 మంది వద్ద రూ.3.50 కోట్లు తీసుకున్నాడు. వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పులు తీర్చడానికి స్తోమత లేదని, తనవద్ద రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని.. చిత్తూరు జిల్లా కోర్టు సముదాయంలోని అడిషినల్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. దీన్ని కోర్టు స్వీకరిస్తూ 105 మందికి నోటీసులు జారీచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇతనికి డబ్బులు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:46 AM