Share News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:46 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం అక్షరాభ్యాసం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో కలశ ప్రతిష్ఠ చేసి వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం
అక్షరాలు దిదిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం అక్షరాభ్యాసం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో కలశ ప్రతిష్ఠ చేసి వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో తమ పిల్లలను ఆలయానికి తీసుకువచ్చి అక్షరాలు దిద్దించారు. ఎమ్మెల్యే సుధీర్‌ చిన్నారులకు పలక, బలపాలు అందజేసి వారి చేత అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 19 , 2025 | 01:46 AM