కార్తీక దీపోత్సవం
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:33 PM
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు కళకళలాడాయి
చిత్తూరు కల్చరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా శైవక్షేత్రాలు పగలంతా శివనామస్మరణతో మార్మోగాయి.సాయంత్రం దీపోత్సవాలతో కళకళలాడాయి. పూజలు,ఉపవాసాలతో మహిళలు ఆలయాలకు చేరుకుని దీపోత్సవాల్లో పాల్గొన్నారు.ఇండ్ల ముందు కూడా ఆవునెయ్యితో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు వద్ద పిండి దీపాలను వెలిగించారు.