Share News

ఇంధనం పొదుపుచేసి.. పర్యావరణాన్ని రక్షిద్దాం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:54 AM

ఇంధనం పొదుపు చేసి.. పర్యావరణాన్ని రక్షిద్దామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

ఇంధనం పొదుపుచేసి.. పర్యావరణాన్ని రక్షిద్దాం
విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంధనం పొదుపు చేసి.. పర్యావరణాన్ని రక్షిద్దామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి, ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వాడితే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయన్నారు. గృహోపకరణాలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్‌లున్న వస్తువులను వినియోగిస్తే విద్యుత్‌ పొదుపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌, ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు అవగాహన ర్యాలీ

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 15(ఆంధ్రజోతి): ఇంధన పొదుపు వారోత్సవాల్లో బాగంగా మంగళవారం చిత్తూరులో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కట్టమంచిలోని వివేకానంద విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుంది. ఎస్పీ తుషార్‌తోపాటు ప్రజాప్రతినిధులు, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొననున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:54 AM