స్వర్ణాంధ్ర లక్ష్యంగా సాగుదాం
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:43 AM
స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకుసాగుదామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాలులో 20 సూత్రాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకుసాగుదామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాలులో 20 సూత్రాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో జిల్లా అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ వైద్య సేవతో ఆరోగ్యపరంగా చిత్తూరు జిల్లా అగ్రభాగాన నిలిచేలా పనిచేయాలన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా రూ.150 కోట్లతో పనులు చేపట్టామన్నారు. చిత్తూరు దాహార్తి తీర్చేందుకు చేపట్టిన అడవిపల్లె రిజర్వాయర్ తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం దినకర్ విలేకరులతో మాట్లాడుతూ 2019-24 మధ్య మున్సిపల్ నిధులను అప్పటి ప్రభుత్వం పక్కదోవ పట్టించి సీఎ్‌ఫఎంఎ్‌సలో వేయడం వల్ల నిధుల కొరత ఏర్పడిందన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి మున్సిపల్ నిధులు నేరుగా మున్సిపల్ ఖాతాకే జమయ్యేలా సీఎంను ఒప్పించామని, తద్వారా రూ.13 కోట్లు నేరుగా అందాయని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకంలో మరింత చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో సీపీవో శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో సుధారాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్, జడ్పీ సీఈవో రవికుమార్, డ్వామా పీడీ రవికుమార్ పాల్గొన్నారు.