మహానాడును విజయవంతం చేద్దాం
ABN , Publish Date - May 22 , 2025 | 02:06 AM
మహానాడును విజయవంతం చేయాలని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్ రాజన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు.
నేడు చిత్తూరు టీడీపీ కార్యాలయంలో జిల్లా స్థాయి మహానాడు
చిత్తూరు సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): మహానాడును విజయవంతం చేయాలని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్ రాజన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమై గురువారం జిల్లా స్థాయి మహానాడును నిర్వహించేందుకు నిర్ణయించారు. కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడును విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన చిత్తూరు నియోజకవర్గ మినీ మహానాడులో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను పార్టీ అధిష్ఠానానికి నివేదించే విషయాలపై కూడా చర్చించారు. గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చిట్టిబాబు నాయుడు, నేతలు చంద్రప్రకాష్, మోహన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.