Share News

రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని..

ABN , Publish Date - May 17 , 2025 | 01:55 AM

శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఆదివారం జరిగే రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని..

తిరుమల/సూళ్లూరుపేట, మే 16 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఆదివారం జరిగే రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌ నమూనాకు ప్రత్యేక పూజలు చేయించారు. శాస్త్రవేత్తలతో కలిసి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ఈ మూడు ఆలయాలను సందర్శించారు. సూళ్లూరుపేటలో ఆలయ సహాయ కమిషనర్‌ ప్రసన్నలక్ష్మి స్వాగతం పలకగా.. పూజలనంతరం వేదపండితులు ఇస్రో చైర్మన్‌కు ఆశీర్వవచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. నిర్దేశిత సమయానికే ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్‌ ప్రయోగం జరుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఇస్రో చైర్మన్‌తోపాటు షార్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజరాజన్‌, ఎన్‌ఏఆర్‌ఎల్‌ డైరెక్టర్‌ ఏకే పాత్ర, ఇస్రో డైరెక్టర్‌ డాక్టర్‌ శివానందన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గుప్తా, అడ్మిన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అభిషేక్‌, ఎంఎ్‌సఏ డిప్యూటీ డైరెక్టర్‌ గోపికృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - May 17 , 2025 | 01:55 AM