నారావారిపల్లెలో చిరుత సంచారం
ABN , Publish Date - Dec 20 , 2025 | 03:02 AM
సీఎం చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చిరుత సంచారం కలకలం రేగింది.
చంద్రంగిరి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చిరుత సంచారం కలకలం రేగింది. శేషాచలం అడవులకు దగ్గరగా గ్రామం ఉండటంతో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో చిరుత టీటీడీ కల్యాణ మండపం వెనుక భాగంలో గ్రామస్తులు కంట పడింది. వీరి కేకలతో సమీప అడవిలోని పెద్దబండపైకి గాండ్రిస్తూ వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. శేషాచలం అడవుల నుంచి రెండు నెమళ్లు నారావారిపల్లె గ్రామ పొలిమేరల్లో సంచరిస్తుండటంతో వాటి కోసం చిరుత వచ్చినట్లు చెప్పారు.