ఆలస్యంగా ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:04 AM
ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం రాత్రి సెంకడరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. చిత్తూరులోని షర్మన్ మెమోరియల్ బాలికల పాఠశాలలో రాత్రి 10.50గంటలకు కౌన్సెలింగ్ మొదలు పెట్టారు.డీఈవో వరలక్ష్మి ఎస్జీటీలకు బదిలీ పత్రాలను అందజేశారు.మంగళవారం సాయంత్రం 3.50 గంటలకు కౌన్సెలింగుకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించినా, రాష్ట్రస్థాయి నుంచి ఖాళీలకు సంబంధించి అధికారిక జాబితా రాకపోవడంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.మొత్తం 3,577మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో జడ్పీ, మండల పరిషత్ యాజమాన్యాల్లో 3190మంది టీచర్లుండగా, ప్రభుత్వ యాజమాన్యంలో నలుగురు, మున్సిపల్ యాజమాన్యంలో 214మంది, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలో 169 మంది ఉన్నారు. తొలి దశలో 350మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.బుధవారం ఉదయం 10గంటలకు 351నుంచి 700వరకూ, మధ్యాహ్నం మూడు గంటలకు 701నుంచి 1000మంది ఎస్జీటీల వరకూ బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తిరుపతి డీఈవో కుమార్, ఏడీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
చిత్తూరు సెంట్రల్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం రాత్రి సెంకడరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. చిత్తూరులోని షర్మన్ మెమోరియల్ బాలికల పాఠశాలలో రాత్రి 10.50గంటలకు కౌన్సెలింగ్ మొదలు పెట్టారు.డీఈవో వరలక్ష్మి ఎస్జీటీలకు బదిలీ పత్రాలను అందజేశారు.మంగళవారం సాయంత్రం 3.50 గంటలకు కౌన్సెలింగుకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించినా, రాష్ట్రస్థాయి నుంచి ఖాళీలకు సంబంధించి అధికారిక జాబితా రాకపోవడంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.మొత్తం 3,577మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో జడ్పీ, మండల పరిషత్ యాజమాన్యాల్లో 3190మంది టీచర్లుండగా, ప్రభుత్వ యాజమాన్యంలో నలుగురు, మున్సిపల్ యాజమాన్యంలో 214మంది, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలో 169 మంది ఉన్నారు. తొలి దశలో 350మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.బుధవారం ఉదయం 10గంటలకు 351నుంచి 700వరకూ, మధ్యాహ్నం మూడు గంటలకు 701నుంచి 1000మంది ఎస్జీటీల వరకూ బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తిరుపతి డీఈవో కుమార్, ఏడీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.