పెద్ద చెరువు గండి పూడ్చివేత
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:40 AM
పలమనేరు పెద్ద చెరువుకట్టకు గండి కొట్టడంపై మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది.ఆక్రమణదారులకోసం మున్సిపల్ అధికారులే వైసీపీ నేత సూచనలతో చెరువుకు గండి కొట్టడంపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, బీజేపీ నాయకులు, అధికారులు స్పందించి గండిని పూడ్పించారు. గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు శరవణకుమార్, వంశీ, జగన్, వక్తిప్రసాద్, కృష్ణప్ప తదితరులు తహసిల్దార్ ఇన్బనాథన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మరోవైపు మంగళవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి. రమణారెడ్డి, తహసిల్దార్ ఇన్బనాథన్, ఇరిగేషన్ డీఈ నాయక్ చెరువు కట్ట గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఎక్సకవేటర్‌ను తెప్పించి చెరువు కట్టకు మరమ్మతులు చేశారు. గతంలో ఉన్న కట్ట వెడల్పును పెంచి గండి పూడ్చివేశారు.
పలమనేరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : పలమనేరు పెద్ద చెరువుకట్టకు గండి కొట్టడంపై మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది.ఆక్రమణదారులకోసం మున్సిపల్ అధికారులే వైసీపీ నేత సూచనలతో చెరువుకు గండి కొట్టడంపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, బీజేపీ నాయకులు, అధికారులు స్పందించి గండిని పూడ్పించారు. గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు శరవణకుమార్, వంశీ, జగన్, వక్తిప్రసాద్, కృష్ణప్ప తదితరులు తహసిల్దార్ ఇన్బనాథన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మరోవైపు మంగళవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి. రమణారెడ్డి, తహసిల్దార్ ఇన్బనాథన్, ఇరిగేషన్ డీఈ నాయక్ చెరువు కట్ట గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఎక్సకవేటర్‌ను తెప్పించి చెరువు కట్టకు మరమ్మతులు చేశారు. గతంలో ఉన్న కట్ట వెడల్పును పెంచి గండి పూడ్చివేశారు. భవిష్యత్తులో ఎవరూ చెరువు కట్టకు గండి కొట్లే అవకాశాలు లేకుండా కట్టకు మరమ్మతులు చేశారు. గండికొట్టిన ఉదంతంపై ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అధికారులతో సమీక్షించారు. పట్టణానికి ఆనుకొనే ఉన్న చెరువులో నీరు నిల్వవుండేలా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను ఉపేక్షించవద్దని సూచించారు.పెద్దచెరువులో దాదాపు 260 మంది ఆక్రమణదారులకు ఇదివరకే పట్టాలు ఇచ్చిన విషయాన్ని మున్సిపల్ ప్లానింగ్ అధికారిణి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా గతంలో ఎప్పుడూ ఆక్రమణదారులు చెరువు నిండి తమ ఇళ్లు జలమయమయ్యాయని చెప్పలేదన్నారు. ఇటీవల ఎవరైనా చెరువులో ఇళ్లు నిర్మించుకొని వుండి వారి ఇళ్లలోకి చెరువు నీరు వస్తున్నందున వారే ఎవరైనా కట్టకు గండికొట్టివుంటారనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దచెరువు నిండి కలుజు పారినప్పుడు గతంలో రాజకాలువ మీదుగా బొమ్మిదొడ్డిచెరువుకు అక్కడ కలుజు పారితే ఆ నీరు కౌండిన్య నదికి చేరుకొనేదని, అయితే ఈ రాజకాలువలు పూర్తిగా ఆక్రమణలకు గురికావడంతో కలుజు నీరంతా ఆయకట్టులోని పొలాలపై వెళ్లాల్సి వస్తోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పూర్తిగా కలుజు నీరు వెళ్లేలా రాజకాలువలను తయారు చేయాలని, ఇందుకోసం నిధులు కూడా అందుబాటులో వున్నాయని తెలిపారు.