ల్యాబ్ ఆన్ వీల్స్
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:04 AM
విద్యార్థుల వద్దకు వెళ్లి సైన్సు పట్ల ఆసక్తి పెంచేలా ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఫ్లో బస్)ను తీర్చిదిద్దారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ‘టెక్నాలజీ బిజినెస్ ఇన్‌క్యూబేటర్ (టీబీఐ)’ ఆధ్వర్యంలో ఈ మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు.
పద్మావతి వర్సిటీ ఆధ్వర్యంలో ఫ్లోబస్ ప్రారంభం
విద్యార్థుల వద్దకు వెళ్లి సైన్సు పట్ల ఆసక్తి పెంచేలా ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఫ్లో బస్)ను తీర్చిదిద్దారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ‘టెక్నాలజీ బిజినెస్ ఇన్‌క్యూబేటర్ (టీబీఐ)’ ఆధ్వర్యంలో ఈ మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రొబొటిక్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలటీ (ఏఆర్-వీఆర్), త్రీడీ ప్రింటింగ్, హోల్ గ్రామ్‌లు, డ్రోన్లు, వాతావరణ పర్యవేక్షణ స్టేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్, మొబైల్ ప్లానిటోరియం, మేకర్స్ స్పేస్, స్టూడెంట్ ఇన్సోవేషన్ షోకేస్ వంటివి ఉన్నాయి. సౌరశక్తితో నడవడం ఈ మొబైల్ ల్యాబ్ ప్రత్యేకత. ఈ ల్యాబ్ బస్సును మంగళవారం పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెన్నం ఉమ ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేశారు. సైన్స్‌కు సంబంధించి విద్యార్థుల్లో అవగాహన కలిగించే లక్ష్యంతో ఈ బస్సు ఏర్పాటు చేసినట్టు వీసీ ఉమ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 40 వేలమందికి పైగా విద్యార్థుల చెంతకు వెళ్ళి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ బస్సు తోడ్పడిందన్నారు. రాష్ట్రంలోనూ విద్యార్థుల వద్దకెళ్లే క్రమంలో పద్మావతి వర్సిటీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించామన్నారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులందరికీ ఈ ఫ్లో బస్‌లో ల్యాబ్‌ను చూసే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్.రజని, ల్యాబ్ సీఈవో మధులా్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.
- తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆంధ్రజ్యోతి