Share News

మహిళా వ్యాపారవేత్తలకు రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:53 AM

మహిళా వ్యాపారవేత్తలకు రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో డ్రాక్రా మహిళలకోసం నెలకొల్పనున్న చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ లోగోను గురువారం ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా రూపొందుతున్నదన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్‌ తరహాలో ఏర్పాటు చేయనున్న చాయ్‌ రాస్తా లే అవుట్‌ను కుప్పంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా డ్వాక్రా మహిళలకు ప్రతినెలా స్థిరాదాయం లభించడంతోపాటు గౌరవం కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. మెప్మా భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో చాయ్‌ రాస్తా ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చనున్నామన్నారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు చాయ్‌ రాస్తా చక్కటి అవకాశమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ అన్నారు. కుప్పంతోపాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో సైతం త్వరలోనే తమ అవుట్‌లెట్‌లు ప్రారంభించనున్నట్లు చాయ్‌ రాస్తా సీఈవో మైకేల్‌ జోషి చెప్పారు. ఈ కార్యక్రమంలో చాయ్‌ రాస్తా డైరెక్టర్లు పి.కిరణ్‌, ఒ.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళా వ్యాపారవేత్తలకు   రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ
చాయ్‌ రాస్తా లోగో ఆవిష్కరిస్తున్న భువనేశ్వరి తదితరులు

కుప్పం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళా వ్యాపారవేత్తలకు రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో డ్రాక్రా మహిళలకోసం నెలకొల్పనున్న చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ లోగోను గురువారం ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా రూపొందుతున్నదన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్‌ తరహాలో ఏర్పాటు చేయనున్న చాయ్‌ రాస్తా లే అవుట్‌ను కుప్పంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా డ్వాక్రా మహిళలకు ప్రతినెలా స్థిరాదాయం లభించడంతోపాటు గౌరవం కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. మెప్మా భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు,

నగరాల్లో చాయ్‌ రాస్తా ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చనున్నామన్నారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు చాయ్‌ రాస్తా చక్కటి అవకాశమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ అన్నారు. కుప్పంతోపాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో సైతం త్వరలోనే తమ అవుట్‌లెట్‌లు ప్రారంభించనున్నట్లు చాయ్‌ రాస్తా సీఈవో మైకేల్‌ జోషి చెప్పారు. ఈ కార్యక్రమంలో చాయ్‌ రాస్తా డైరెక్టర్లు పి.కిరణ్‌, ఒ.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:53 AM