Share News

కుప్పం చేరిన ‘కృష్ణమ్మ’

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:33 AM

కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు తీరింది. కృష్ణమ్మ జలాలు బిరబిరా పరుగులు పెడుతూ వచ్చేశాయి. శనివారం రాత్రి రామకుప్పం మండలం కొంగాటం గ్రామానికి చేరుకున్న జలాలు.. ఆదివారం ఉదయానికి శాంతిపురం మండలం మఠం పంచాయతీలోకి ప్రవహించాయి. ఈ సందర్భంగా గుండిశెట్టిపల్లె వద్ద ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పీఎంకే ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురే్‌షబాబు జలహారతి ఇచ్చారు. రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, సంబరాలు చేసుకున్నారు. కొందరు జంతు బలులిచ్చారు. ఏర్పాట్లను సొన్నేగానిపల్లె పంచాయతీ సర్పంచ్‌ పుష్పవతి, టీడీపీ మండల అధ్యక్షుడు భాష్యం విశ్వనాథనాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ నందిగం ఉదయకుమార్‌ నాయుడు ఆధ్వర్యంలో చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కంచర్ల, మునిరత్నం, సురే్‌షబాబు ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదని హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రశంసించారు. గత ప్రభుత్వంలో జగన్‌.. సినిమా సెట్‌ వేసి కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తున్నామని జగన్నాటకం ఆడారని గుర్తుచేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కుప్పానికి కృష్టమ్మను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణ కుప్పం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. సోమవారానికంతా పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరుతాయన్నారు. ఈనెల 30వ తేదీనాటికి చెరువు నిండి మొరవపారి, కింద చెరువు కూడా నిండుతుందని తెలిపారు. అలా నియోజకవర్గంలోని 240 చెరువులు నిండటం ఖాయమన్నారు. 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.. పరమసముద్రం చెరువు సమీపంలో జలహారతి ఇస్తారన్నారు. అక్కడే బహరింగ సభ ఉంటుందని, ప్రతి ఒక్కరూ హాజరై.. కుప్పానికి నీళ్లిచ్చిన సీఎంకు కృతజ్ఞతులు తెలపాలని కోరారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పీవీ నాగరాజు, క్లస్టర్‌ ఇన్‌చార్జి రాజేంద్ర, రెస్కో చైర్మన్‌ ప్రతాప్‌, డైరెక్టర్లు అనుసూయ, బసవరాజు, శరవణకుమార్‌, టీడీపీ నేతలు చంద్రశేఖర్‌, మణి, వెంకటేష్‌, పెద్దన్న, ఆర్‌.నాగరాజు, బాలు, సింగిరి శ్రీనివాసులు, క్యాబేజీ మురళి, ఉయ్యాల జయరామిరెడ్డి, మునెప్ప, ఏఎంసీ డైరెక్టర్లు, కడా అడ్వైజరీ కమిటీ సభ్యులు, మహిళ నేతలు రూప, హేమావతి, వేద, పౌలారాణి, కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కుప్పం చేరిన ‘కృష్ణమ్మ’
గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ-నీవా కాలువలో సారె వదలి పూజలు చేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌, పీఎస్‌ మునిరత్నం, తదితరులు

- జలహారతి ఇచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌

- సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు, రైతులు

- జనసంద్రమైన గుండిశెట్టిపల్లె హంద్రీ- నీవా కాలువ గట్టు

శాంతిపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు తీరింది. కృష్ణమ్మ జలాలు బిరబిరా పరుగులు పెడుతూ వచ్చేశాయి. శనివారం రాత్రి రామకుప్పం మండలం కొంగాటం గ్రామానికి చేరుకున్న జలాలు.. ఆదివారం ఉదయానికి శాంతిపురం మండలం మఠం పంచాయతీలోకి ప్రవహించాయి. ఈ సందర్భంగా గుండిశెట్టిపల్లె వద్ద ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పీఎంకే ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురే్‌షబాబు జలహారతి ఇచ్చారు. రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, సంబరాలు చేసుకున్నారు. కొందరు జంతు బలులిచ్చారు. ఏర్పాట్లను సొన్నేగానిపల్లె పంచాయతీ సర్పంచ్‌ పుష్పవతి, టీడీపీ మండల అధ్యక్షుడు భాష్యం విశ్వనాథనాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ నందిగం ఉదయకుమార్‌ నాయుడు ఆధ్వర్యంలో చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కంచర్ల, మునిరత్నం, సురే్‌షబాబు ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదని హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రశంసించారు. గత ప్రభుత్వంలో జగన్‌.. సినిమా సెట్‌ వేసి కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తున్నామని జగన్నాటకం ఆడారని గుర్తుచేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కుప్పానికి కృష్టమ్మను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణ కుప్పం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. సోమవారానికంతా పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరుతాయన్నారు. ఈనెల 30వ తేదీనాటికి చెరువు నిండి మొరవపారి, కింద చెరువు కూడా నిండుతుందని తెలిపారు. అలా నియోజకవర్గంలోని 240 చెరువులు నిండటం ఖాయమన్నారు. 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.. పరమసముద్రం చెరువు సమీపంలో జలహారతి ఇస్తారన్నారు. అక్కడే బహరింగ సభ ఉంటుందని, ప్రతి ఒక్కరూ హాజరై.. కుప్పానికి నీళ్లిచ్చిన సీఎంకు కృతజ్ఞతులు తెలపాలని కోరారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పీవీ నాగరాజు, క్లస్టర్‌ ఇన్‌చార్జి రాజేంద్ర, రెస్కో చైర్మన్‌ ప్రతాప్‌, డైరెక్టర్లు అనుసూయ, బసవరాజు, శరవణకుమార్‌, టీడీపీ నేతలు చంద్రశేఖర్‌, మణి, వెంకటేష్‌, పెద్దన్న, ఆర్‌.నాగరాజు, బాలు, సింగిరి శ్రీనివాసులు, క్యాబేజీ మురళి, ఉయ్యాల జయరామిరెడ్డి, మునెప్ప, ఏఎంసీ డైరెక్టర్లు, కడా అడ్వైజరీ కమిటీ సభ్యులు, మహిళ నేతలు రూప, హేమావతి, వేద, పౌలారాణి, కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 02:33 AM