‘తెలుగు’ ఔన్నత్యాన్ని తెలుసుకోండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:15 AM
‘తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించండి. ప్రాముఖ్యతను తెలుసుకోండి. తెలుగు భాషపై మక్కువ చూపండి’ అంటూ పిల్లలకు జేసీ శుభం బన్సల్ పిలుపునిచ్చారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు.
‘తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించండి. ప్రాముఖ్యతను తెలుసుకోండి. తెలుగు భాషపై మక్కువ చూపండి’ అంటూ పిల్లలకు జేసీ శుభం బన్సల్ పిలుపునిచ్చారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అధికారులు నివాళులర్పించారు. గ్రాంధిక భాష వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న రోజుల్లో.. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు శ్రీకారం చుట్టారని జేసీ గుర్తుచేసుకున్నారు. ‘ఇంగ్లిష్ మాధ్యమంతో తెలుగు మాట్లాడటం అరుదుగా మారింది. పిల్లలూ తెలుగులో చదవండి. రాయండి. మాట్లాడండి. ప్రతిరోజూ తెలుగు పత్రికలు చదవండి. వేమన, సుమతి శతకాలను అవగాహన చేసుకోండి’ అని డీఆర్వో నరసింహులు కోరారు. తెలుగుభాషకు సేవ చేస్తున్న పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీలు శివశంకరనాయక్, రోజ్మాండ్, పర్యాటకశాఖ జిల్లా అధికారి జనార్దన్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
- తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి