తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవం
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:50 AM
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు. వివిధ పూజా కార్యక్రమాల తర్వాత ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి ఆవిర్భావం నృత్యరూపకం ప్రదర్శించారు. తర్వాత భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీనీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకా్‌షరెడ్డి, జేఈవో వి.వీరబ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారు కృష్ణశేషాచల దీక్షితులు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు, హెచ్‌డీపీ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్, భక్తులు పాల్గొన్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి