కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డు ఖరారు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:45 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి 16మందితో ట్రస్టు బోర్డు ఖరారైంది. చైర్మన్‌గా మణి నాయుడు అలియాస్ సురేంద్రను కొద్దిరోజుల క్రితమే ఖరారు చేసిన విషయం తెలిసిందే. సభ్యులుగా మన రాష్ట్రం నుంచే కాక తెలంగాణకు చెందిన ఒకరిని కూడా నియమించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి 16మందితో ట్రస్టు బోర్డు ఖరారైంది. చైర్మన్‌గా మణి నాయుడు అలియాస్ సురేంద్రను కొద్దిరోజుల క్రితమే ఖరారు చేసిన విషయం తెలిసిందే. సభ్యులుగా మన రాష్ట్రం నుంచే కాక తెలంగాణకు చెందిన ఒకరిని కూడా నియమించారు.వీరిలో టీడీపీకి చెందిన వారితో పాటు జనసేన పార్టీ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒక్కరికి స్థానం లభించింది. వీరిలో చంద్రశేఖర రెడ్డి, కాది సుధాకర రెడ్డి,కొత్తపల్లె శివప్రసాద్, ఊట్ల నాగరాజు నాయుడు,పెరుమాళ్ల సుబ్బారెడ్డి(బీజేపీ) (పూతలపట్టు నియోజకవర్గం),డాక్టర్ బీవీ సురేష్,వసంత(కుప్పం),కేఎస్.అనసూయమ్మ(గంగా ధర నెల్లూరు),శ్రీవాణి (పీలేరు), పద్మలత కనకరాజు(చంద్రగిరి), పరిమి చంద్రకళ(తాడిపత్రి),సంధ్యారాణి దేవరకొండ(రాజంపేట),గుంటుపల్లె సునీత (ప్రత్తిపాడు), టీవీ రాజ్యలక్ష్మి(కర్నూలు), కీలపర్తి రాజేశ్వరి(మాడుగుల)తో పాటు తెలంగాణ నుంచి శ్రీపతి సతీష్ వున్నారు.