‘కలంకారీ’ మునిరత్నమ్మ హఠాన్మరణం
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:14 AM
కలంకారీలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎంతో పేరు గాంచిన మునిరత్నమ్మ ఆదివారం హఠాన్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన మునిరత్నమ్మ మూడు దశాబ్దాలకుపైగా కలంకారీలో ఎన్నో వైవిద్య చిత్రాలను రూపొందించారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కలంకారీలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎంతో పేరు గాంచిన మునిరత్నమ్మ ఆదివారం హఠాన్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన మునిరత్నమ్మ మూడు దశాబ్దాలకుపైగా కలంకారీలో ఎన్నో వైవిద్య చిత్రాలను రూపొందించారు. రాష్ట్ర అవార్డుతో పాటు దేశవిదేశాల్లో ఎన్నో ప్రశంసలు పొందారు. 2008 కలంకారీలో తొలి మహిళా కలంకారీ జాతీయస్థాయి అవార్డును అందుకున్నారు. తుదిశ్వాస వరకు హస్తకళప్రావీణ్యంలో రాణించారు. ప్రపంచ నలుమూలలోని పలు దేశాల్లో ఆమె చిత్రాలకు అభిమానులను సంపాదించుకున్నారు. ఆదివారం ఆమె హఠాన్మరణంతో హస్తకళల అభిమానులు, సాటి కళాకారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.