Share News

పారదర్శకంగా జేఎల్స్‌ బదిలీలు: ఆర్జేడీ

ABN , Publish Date - May 22 , 2025 | 02:02 AM

ఇంటర్మీడియట్‌ విద్యలో అధ్యాపకుల బదిలీలు పారదర్శకంగా చేపట్టనున్నట్లు చిత్తూరు డీఐఈవో, కడప ఆర్జేడీ శ్రీనివాసులు వెల్లడించారు

పారదర్శకంగా జేఎల్స్‌ బదిలీలు: ఆర్జేడీ

చిత్తూరు సెంట్రల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యలో అధ్యాపకుల బదిలీలు పారదర్శకంగా చేపట్టనున్నట్లు చిత్తూరు డీఐఈవో, కడప ఆర్జేడీ శ్రీనివాసులు వెల్లడించారు.బుధవారం డీఐఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ రీజియన్‌ పరిధిలో 68 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయని చెప్పారు.ఇందులో 400 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు, 68మంది ప్రిన్సిపాళ్లు ఉన్నారని తెలిపారు. బదిలీలకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు రాగానే బదిలీ ప్రక్రియ చేపట్టి నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ ఒకటి వరకు జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియవుంటుందని, జూన్‌ రెండవ తేదీ నుంచి రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ యాజమాన్య కళాశాలల విద్యార్థులకు సెకండియర్‌కు సంబంధించి స్టడీ మెటీరియల్‌ పోటీ పరీక్షలకు సంబంధించిన తెలుగు బుక్‌లెట్స్‌ వచ్చాయన్నారు. జూన్‌ 2న కళాశాలలు ప్రారంభం కాగానే సెకండియర్‌ విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. కాగా ఫస్టియర్‌, సెకండియర్‌కు సంబంధించి టెక్ట్స్‌బుక్స్‌ రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ అడ్వాన్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన క్రమంలో ఈనెల 19 నుంచి తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని చెప్పారు.

Updated Date - May 22 , 2025 | 02:02 AM