Share News

ఫైళ్ల క్లియరెన్స్‌లో జెట్‌ స్పీడ్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:38 AM

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వడివడిగా ఫైళ్లను క్లియర్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన వద్దకు ఎక్కువ సంఖ్యలో ఫైల్స్‌ వస్తున్నాయి. ఆరు నెలల్లో ఏకంగా 7,150 ఫైల్స్‌ వచ్చాయి. రాష్ట్రంలోనే ఇది ప్రథమ స్థానం.జేసీ విద్యాధరి వద్దకూ 4,120 వచ్చాయి.

ఫైళ్ల క్లియరెన్స్‌లో జెట్‌ స్పీడ్‌

కలెక్టర్‌ వద్ద ఆరు నెలల్లో 7003 ఫైళ్లు చకచకా..

వాయువేగ స్పందనతో సుమిత్‌కుమార్‌ టాప్‌

అదే తరహాలో జేసీ విద్యాధరి

చిత్తూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వడివడిగా ఫైళ్లను క్లియర్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన వద్దకు ఎక్కువ సంఖ్యలో ఫైల్స్‌ వస్తున్నాయి. ఆరు నెలల్లో ఏకంగా 7,150 ఫైల్స్‌ వచ్చాయి. రాష్ట్రంలోనే ఇది ప్రథమ స్థానం.జేసీ విద్యాధరి వద్దకూ 4,120 వచ్చాయి. ఇది రాష్ట్రంలో ఐదో స్థానం. వీరి వద్దకు వస్తున్న ఫైల్స్‌ సగటున ఒకట్రెండు రోజుల్లోనే క్లియర్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఫైల్స్‌ క్లియరె న్సులో మంత్రులు, సెక్రటరీలు (ఐఏఎస్‌), సెక్రటరియేట్‌ డిపార్ట్‌మెంట్‌ వారీగా, హెచ్‌వోడీ్‌సలతో పాటు కలెక్టర్‌, జేసీలు ఏ స్థానంలో ఉన్నారో ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

కలెక్టర్‌ వద్ద 30 గంటలు..

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వద్దకు జూలై 15 నుంచి డిసెంంబరు 9 వరకు అన్ని శాఖలకు చెందిన 7,150 ఫైల్స్‌ వచ్చాయి. అందులో 7,003 ఆయన క్లియర్‌ చేశారు. ఇందుకు సగటున 31 గంటలు పట్టింది. అలాగే సెప్టెంబరు 9 నుంచి డిసెంబరు 9 వరకు 1,555 ఫైల్స్‌ వస్తే, ఇందులో 1,421 క్లియర్‌ చేసేశారు. దీనికి సగటున 30 గంటల సమయం పట్టింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో ఫైల్స్‌ భారం అధికంగా ఉంది. ఆరు నెలల కాలానికి.. టాప్‌ 3 జిల్లాలు చూసుకుంటే చిత్తూరు కలెక్టర్‌కు 7,150, నంద్యాల కలెక్టర్‌కు 5,906, శ్రీకాకుళం కలెక్టర్‌కు 4,776 ఫైల్స్‌ వచ్చాయి. మన్యం కలెక్టర్‌కు 109, పల్నాడు కలెక్టర్‌కు 110, కాకినాడ కలెక్టర్‌కు 146 ఫైల్స్‌ వచ్చాయి. ఫైల్స్‌ తాకిడి విషయంలో ఈ మూడు జిల్లాలు కింది మూడు స్థానాల్లో ఉన్నాయి.

జేసీ వద్ద 3.5 రోజులు..

జేసీ విద్యాధరి వద్దకు జూలై 15 నుంచి డిసెంబరు 9 వరకు 4,120 ఫైల్స్‌ వచ్చాయి. ఇందులో 4,092 క్లియర్‌ అయ్యాయి. సగటున 3.5 రోజుల సమయం పట్టింది. ఫైల్స్‌ సంఖ్య, క్లియర్‌ విషయంలో జేసీ 5వ స్థానంలో ఉన్నారు. సెప్టెంబరు 9 నుంచి డిసెంబరు 9 వరకు 318 ఫైల్స్‌ వస్తే.. అవన్నీ క్లియర్‌ చేశారు. ఇందుకు సగటున 43 గంటల సమయం పట్టింది.

Updated Date - Dec 11 , 2025 | 01:38 AM