జేసీ శుభమ్ బన్సల్ బదిలీ
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:14 AM
జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్ బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జూనియర్ అధికారి అయినప్పటికీ చాలా కీలక పోస్టింగ్ అందుకున్నారు. గతేడాది జూలై 24న జేసీగా బాధ్యతలు తీసుకున్న ఈయన ప్రజలతో, ప్రజాప్రతినిధులతో పెద్దగా మమేకం కాలేకపోయారు. భూసేకరణ, ఇతర భూ అంశాలకు సంబంధించి తొందరపడి ఫైళ్లు క్లియర్ చేస్తే వివాదాల్లో చిక్కుకుంటామేమోనన్న అనుమానంతో జాప్యం చేయడంతో పెండింగ్ పడుతూ వచ్చాయి. అదే సమయంలో జిల్లాలో పారిశ్రామిక, జాతీయ రహదారులపరంగా భూసేకరణ విషయాల్లో చురుగ్గా పనిచేశారు. పారిశ్రామికంగా జిల్లా కీలక స్థానంలో ఉన్న నేపథ్యంలో జేసీగా శుభమ్ బన్సల్ పనితీరును, ఆయన అవగాహనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలకమైన పరిశ్రమల శాఖకు డైరెక్టర్‌గా బదిలీ చేసింది. గతంలోనే నియమించాలని ప్రయత్నించినా జిల్లాలో ఆయన అవసరం ఉందంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ అభ్యర్థించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది. కాగా, జిల్లాకు ఎవరినీ జేసీగా నియమించలేదు.
పరిశ్రమల డైరెక్టర్‌గా కీలక పోస్టింగ్
తిరుపతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్ బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జూనియర్ అధికారి అయినప్పటికీ చాలా కీలక పోస్టింగ్ అందుకున్నారు. గతేడాది జూలై 24న జేసీగా బాధ్యతలు తీసుకున్న ఈయన ప్రజలతో, ప్రజాప్రతినిధులతో పెద్దగా మమేకం కాలేకపోయారు. భూసేకరణ, ఇతర భూ అంశాలకు సంబంధించి తొందరపడి ఫైళ్లు క్లియర్ చేస్తే వివాదాల్లో చిక్కుకుంటామేమోనన్న అనుమానంతో జాప్యం చేయడంతో పెండింగ్ పడుతూ వచ్చాయి. అదే సమయంలో జిల్లాలో పారిశ్రామిక, జాతీయ రహదారులపరంగా భూసేకరణ విషయాల్లో చురుగ్గా పనిచేశారు. పారిశ్రామికంగా జిల్లా కీలక స్థానంలో ఉన్న నేపథ్యంలో జేసీగా శుభమ్ బన్సల్ పనితీరును, ఆయన అవగాహనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలకమైన పరిశ్రమల శాఖకు డైరెక్టర్‌గా బదిలీ చేసింది. గతంలోనే నియమించాలని ప్రయత్నించినా జిల్లాలో ఆయన అవసరం ఉందంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ అభ్యర్థించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది. కాగా, జిల్లాకు ఎవరినీ జేసీగా నియమించలేదు.