Share News

జిల్లాకు ‘జన్‌భాగ్‌దారి’ అవార్డు

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:59 AM

వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో మన జిల్లా.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ‘జన్‌భాగ్‌దారి’ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం గుంటూరులో నిర్వహించిన వాటర్‌ షెడ్‌ నేషనల్‌ లెవల్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ద్వారా ఈ అవార్డును డ్వామా పీడీ రవికుమార్‌,ప్రాజెక్టు అధికారి శోభారాణి అందుకున్నారు.

జిల్లాకు ‘జన్‌భాగ్‌దారి’ అవార్డు
కేంద్ర మంత్రుల నుంచి అవార్డు అందుకుంటున్న రవికుమార్‌,శోభారాణి

సదుం/చిత్తూరు సెంట్రల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో మన జిల్లా.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ‘జన్‌భాగ్‌దారి’ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం గుంటూరులో నిర్వహించిన వాటర్‌ షెడ్‌ నేషనల్‌ లెవల్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ద్వారా ఈ అవార్డును డ్వామా పీడీ రవికుమార్‌,ప్రాజెక్టు అధికారి శోభారాణి అందుకున్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎ్‌సవై) కార్యక్రమంలో భాగంగా సదుం మండలం చెరుకువారిపల్లె వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా 211పనులు చేపట్టి రూ.3.28కోట్లు ఖర్చు చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 617 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ అవార్డుతో చెరుకువారిపల్లె వాటర్‌ షెడ్‌ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరో రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులను సహజ వనరుల యాజమాన్యం కింద ఉపయోగించుకోవాలని కేంద్రప్రభుత్వం సూచించినట్లు డ్వామా పీడీ రవి కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 12 , 2025 | 12:59 AM