ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ డ్రామాలు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:48 AM
తమ కుంభకోణాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుంటే వాటినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ డ్రామాలాడుతున్నారు. తొలి ఏడాది కనీసం పది శాతం హామీలనూ నెరవేర్చని జగన్ కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. కన్న తల్లి, చెల్లెలితోపాటు అన్ని వర్గాలకూ జగన్ వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు, గొడ్డలివేటు అనేవి జగన్‌రెడ్డి పేటెంట్లు. అరాచకాలు, అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నేడు అరచి గగ్గోలు పెట్టినా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ఇప్పటికైనా జగన్ దుష్ప్రచారాలను మానుకోకుంటే మరింత ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

-పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి
గొడ్డలిపోటు చరిత్ర జగన్‌దే
తన భుజాలపై మోసిన బాబాయిని గొడ్డలిపోటుతో చంపినవారిని కాపాడి రక్త సంబంధానికి.. తల్లిని, చెల్లిని ఇంటినుంచి తరిమేసి కుటుంబ వ్యవస్థకు.. మచ్చ తెచ్చిన జగన్ వెన్నుపోటు దినోత్సవం పేరిట రోడ్డెక్కడం దారుణం. వైసీపీని స్థాపించిన శివకుమార్‌ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్న జగన్‌రెడ్డి పరిపాలనను గమనించే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.11సీట్లిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70 శాతం హామీలు అమలు చేస్తే ఏడాదిలో కేవలం 10శాతం హామీలు మాత్రమే నెరవేర్చిన వైసీపీ ఇపుడు వెన్నుపోటు దినం పేరిట రోడ్డెక్కడం హాస్యాస్పదం.
- నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్
జగనే నిజమైన వెన్నుపోటుదారుడు
జూన్ 4వ తేదీ.. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందిన రోజు.కూటమి ప్రభుత్వం అందిస్తున్న మంచి పరిపాలన చూసి ఓర్వలేక జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించడం వైసీపీ నాయకులకు తగదు.నిజంగా జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే జూన్ నాలుగుకు గొడ్డలిపోటు దినంగా నామకరణం చేసుకోవాలి. ఆస్తులకోసం తల్లి,చెల్లిని గెంటేసిన జగన్‌రెడ్డి కూడా నీతులు చెబుతుంటే జనం నవ్వుతున్నారు. జగన్ పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం బంగారుపాళ్యంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటాం.
- పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్
11 సీట్లిచ్చినా బుద్ధి రాలేదా?
అసెంబ్లీ ఎన్నికల్లో 11సీట్లతో జనం శాస్తి చేసినా జగన్‌రెడ్డికి బుద్ధి రాలేదు.ఐదేళ్లపాటు అరాచక పాలన చేయడమే కాక మూడు రాజధానుల పేరుతో ప్లేటు ఫిరాయించి వెన్నుపోటు పొడిచిందెవరు?జూన్ 4వతేదీకి వెన్నుపోటు దినం కాకుండా సొంతకుటుంబ సభ్యుల్ని పులివెందుల్లో గొడ్డలిపోటుతో వేసేసిన దినంగా, వైజాగ్ ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా దినంగా, ఎన్నికల ప్రచారంలో గులకరాయితో ప్రజల సానుభూతికోసం నటించిన దినంగా, సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రె్‌సకు వెన్నుపోటు పొడిచిన దినంగా పెట్టుకోవాలి.కూటమి సంక్షేమ పాలనలో జూన్ నాలుగును అభివృద్ధి - సంక్షేమ దినంగా ప్రజలు పాటించి సంబరాలు చేసుకోవాలి.
- గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్