ఈనెలా కందిపప్పు లేనట్లే!
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:35 AM
రేషన్ కార్డుదారులకు ఈనెలలో కూడా కందిపప్పు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని 5.85 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా 81,230 టన్నుల బియ్యం, 510 టన్నుల చక్కెర, 420 టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంది. బియ్యం, చక్కెర పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కందిపప్పు విషయానికి వచ్చసరికి మొండిచేయి చూపుతోంది.
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుదారులకు ఈనెలలో కూడా కందిపప్పు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని 5.85 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా 81,230 టన్నుల బియ్యం, 510 టన్నుల చక్కెర, 420 టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంది. బియ్యం, చక్కెర పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కందిపప్పు విషయానికి వచ్చసరికి మొండిచేయి చూపుతోంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు నాణ్యతను బట్టి కిలో రూ.140 నుంచి 160 వరకు పలుకుతోంది. దీంతో కార్డుదారులు రేషన్ షాపుల్లో ఇచ్చే రాయితీ కందిపప్పు కోసం ఎదురు చూస్తున్నారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలం గడుపుతుండటంతో అసంతృప్తికి గురవుతున్నారు. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు.