మంచి పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దడం మనందరి బాధ్యత
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:36 AM
విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని తెలియజేయడమే మెగా పీటీఎం 3.0 లక్ష్యమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.జిల్లా విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెగా పేరెంట్, టీచర్స్ మీటింగులు నిర్వహించారు.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని తెలియజేయడమే మెగా పీటీఎం 3.0 లక్ష్యమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.జిల్లా విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెగా పేరెంట్, టీచర్స్ మీటింగులు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 2408 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు గాను 2202 పాఠశాలల్లో (91శాతం) ఈ సమావేశాలు నిర్వహించారు.పిల్లల తల్లిదండ్రులతో పాటు ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, ఎస్‌ఎంసీ సభ్యులు హాజరు కాగా విద్యార్థులతో పాటు టీచర్లు వారికి స్వాగతం పలికారు.పిల్లల విద్యాభ్యాసం గురించి వివరించారు.పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తనతో పాటు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తల్లిదండ్రులకు టీచర్లు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను చూపించి వివరించారు. విద్యార్థులచే ఏర్పాటు చేయించిన ఎగ్జిబిషన్లలో క్రీడా సామగ్రి, ల్యాబ్, లైబ్రరీ పుస్తకాలు, జాదుయ్ పితార్ కిట్లు, ఎఫ్‌ఎల్‌ఎన్ లెర్నింగ్ కిట్లను అతిథులు సందర్శించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల (సమగ్ర మూల్యాంకన పత్రాలు)ను విద్యార్థులు అందుకున్నారు.విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు సహపంక్తిన మధ్యాహ్న భోజనం చేయడంతో కార్యక్రమం ముగిసింది.
మాక్ అసెంబ్లీలో మంత్రిగా
రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26న ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో నేను చిత్తూరు ఎమ్మెల్యేగానే కాక రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించాను. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేతలు అడిగన ప్రశ్నలకు దీటైన జవాబులిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తదితరులతో ప్రశంసలందుకోవడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి.నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, పాఠశాల హెచ్‌ఎంకు, టీచర్లకు రుణపడి ఉంటాను.
-ఎన్.ప్రియదర్శిని, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిత్తూరు