అంబేడ్కర్ విగ్రహ ఘటనలో వీడని మిస్టరీ?
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:21 AM
వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనపై బొమ్మయ్యపల్లె గ్రామ కార్యదర్శి రాము ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వెదురుకుప్పం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనపై బొమ్మయ్యపల్లె గ్రామ కార్యదర్శి రాము ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారం వెనుక కుట్ర, ఇతరత్రా కారణాలను లోతుగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.విగ్రహం వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.శుక్రవారం పార్టీల పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో శనివారం దేవళంపేటలో పోలీసు బలగాలు మొహరించారు. డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్ సహా నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, నలబై మంది పోలీసులు దేవళంపేటకు చేరుకున్నారు.అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.