నేరస్థుల్లో కనిపించని భయాందోళన
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:53 AM
ఉరిశిక్ష పడిన ఐదుగురు నేరస్థుల్లో ఎలాంటి భయాందోళనా కనించలేదు. జడ్జి ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పిన సమయంలో ఐదుగురు నేరస్థులూ కోర్టు హాలులో ఉన్నారు. ఆ సమయంలో వారిలో ఎలాంటి అలజడి కనిపించలేదు.
చిత్తూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉరిశిక్ష పడిన ఐదుగురు నేరస్థుల్లో ఎలాంటి భయాందోళనా కనించలేదు. జడ్జి ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పిన సమయంలో ఐదుగురు నేరస్థులూ కోర్టు హాలులో ఉన్నారు. ఆ సమయంలో వారిలో ఎలాంటి అలజడి కనిపించలేదు. ఏ5 వెంకటేష్ మాత్రం కాస్త కలత చెందినట్లు కనిపించారు. మిగిలినవారిలో ఎలాంటి రియాక్షన్ లేదు. చింటూ అనుచరులు మినహా మిగిలినవారి కుటుంబీకులు, బంధుమిత్రులు కోర్టు వద్దకు రాలేదు. చింటూ తల్లి కూడా వయసు మీద పడడం, అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని మరో కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆమె కూడా ఇక్కడికి రాలేదు.శిక్ష పడిన ఐదుగురినీ పోలీసులు కస్టడీకి తీసుకుని వ్యాన్లో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ సమయంలో చింటూ కోర్టు హాలు నుంచి కింద ఉన్న వ్యాను ఎక్కేందుకు వస్తూ అక్కడ కనిపించిన అనుచరులకు నవ్వుతూ చెయ్యి ఊపి వ్యాన్ ఎక్కాడు.