హత్య కోణంలో దర్యాప్తు చేయాలి : భానుప్రకా్‌షరెడ్డి
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:33 AM
టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి అయిన మాజీ టీటీడీ ఏవీఎ్‌సఓ సతీ్‌షకుమార్ మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం హత్య కోణంలో దర్యాప్తు చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి కోరారు.
తిరుపతి(ఉపాధ్యాయనగర్), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి అయిన మాజీ టీటీడీ ఏవీఎ్‌సఓ సతీ్‌షకుమార్ మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం హత్య కోణంలో దర్యాప్తు చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం వీడియో ప్రకటన విడుదల చేశారు. మృతదేహం రైల్వేట్రాక్‌పై కనిపించడంపట్ల అనుమానం వ్యక్తం చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా మలిచిన వ్యక్తులు ఏమైనా చెయ్యగలరని అన్నారు. మిగతా సాక్షులుకూడా భయబ్రాంతులకు గురౌతున్నారని, వారందిరికీ పోలీసు భద్రత కల్పించాలని కోరారు.
హత్య అయ్యుండచ్చు: హరిప్రసాద్
తిరుపతి అర్బన్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పరకామణి కేసులో కీలక సమాచారాన్ని సీఐడీకి అందించిన అధికారి మృతి యాదృచ్ఛికం కాదని జనసేన ఉమడి జిల్లా అధ్యక్షుడు పి.హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విచారణాధికారులకు ఇప్పటికే ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు రావలసివుండగా ఈ ఘటన జరిగింది. హత్య అయ్యిండే అవకాశాలు కనిిపిస్తున్నాయి’ అన్నారు. ఈ కేసులో మరొక రవికుమార్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని హెచ్చరించారు. అతనిని పోలీసులు కస్టడీలో సురక్షితంగా ఉంచాలన్నారు.
సాక్ష్యాలను తారుమారు చేసేందుకే..: రవినాయుడు
తిరుపతి(ఎంఆర్‌పల్లె), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పరకామణి కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకే మాజీ ఏవీఎ్‌సవో సతీ్‌షకుమార్ హత్య జరిగిందని, ఇది వైసీపీ పనేనని శాప్ చైర్మన్ రవినాయుడు శుక్రవారం అన్నారు. బాబాయి గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పరకామణి కేసులో కూడా అదే చేస్తున్నారన్నారు. వంద శాతం నేరాన్ని జీరోసాక్ష్యం లేకుండా చేయడం వైసీపీ డీఎన్‌ఏలో ఉందన్నారు. వాస్తవాలను సమాధి చేసేందుకు వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు.
రవికుమార్‌కు ప్రాణహాని వుంది: కిరణ్‌రాయల్
తిరుపతి అర్బన్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పరకామణి నిందితుడు రవికుమార్‌కు ప్రాణహాని ఉందని తిరుపతి జనసేన సీనియర్ నేత కిరణ్‌రాయల్ ఆరోపించారు. వెంటనే అతనిని పోలీస్ కస్టడీకి తీసుకోవాలని కోరారు. సతీ్‌షకుమార్‌ది ఆత్మహత్మ, హత్యా అనేది తెలియాల్సివుందన్నారు. పరకామణి కేసులో వీరిద్దరే కీలకమన్నారు. రవికుమార్‌ను 2తేదీ వరకు పోలీసు అదుపులో ఉంచితే విసయాలన్నీ బయటపడుతాయన్నారు.
నా పేరు చెప్పమని బెదిరించడంతో ఆత్మహత్య: భూమన
తిరుపతి(జీవకోన), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విచారణలో భయపెట్టి, బెదిరించిన కారణంగానే పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీ్‌షకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, సతీ్‌షకుమార్‌చేత బలవంతంగా తన పేరును చెప్పించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపుతున్న కారణంగానే ఈ కేసులో తనను ఇరికించాలని కుట్ర చేస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈకోణంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.