డీసీసీబీలో అవకతవకలపై విచారణ పూర్తి
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:45 AM
వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపిన డీఆర్వో మోహన్‌కుమార్ గతవారం తన నివేదికను కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అందించారు. డీసీసీబీలో అక్రమాలకు సంబంధించి గత ఏడాది జూలై 11న డీసీసీబీలో దారుణాలు, జూలై 12న అక్రమాలకు సింగిల్‌విండో శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపిన డీఆర్వో మోహన్‌కుమార్ గతవారం తన నివేదికను కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అందించారు. డీసీసీబీలో అక్రమాలకు సంబంధించి గత ఏడాది జూలై 11న డీసీసీబీలో దారుణాలు, జూలై 12న అక్రమాలకు సింగిల్‌విండో శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి.ఆర్థిక విధ్వంసంపై నవంబరు 13న మరో కథనం వచ్చింది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత దొరబాబు గత పాలకవర్గం చేసిన తప్పిదాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం సహకార చట్టం-51ప్రకారం విచారణ జరిపి నివేదికను పంపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో విచారణ అధికారిగా డీఆర్వోను మార్చి నెలలో నియమిస్తూ జూలైలోగా నివేదికను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో పలు విడతలుగా వందమందికి పైగా బ్యాంకు అధికారులను, సింగిల్‌విండోల సీఈవోలను, సిబ్బందిని, అప్పటి బ్యాంకు పాలకవర్గ చైర్‌పర్సన్ రెడ్డమ్మతో పాటు డైరెక్టర్లను విచారణకు హాజరుకమ్మని డీఆర్వో నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారందరూ డీఆర్వో ఎదుట హాజరై రాతపూర్వకంగా తమ సంజాయిషీని ఇచ్చారు. వాటన్నింటిని పరిశీలించి డీఆర్వో గత వారం కలెక్టర్‌కు విచారణ నివేదికను అందించారు.ఈ నివేదికను కూలంకుషంగా పరిశీలించి ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్‌తో తన నివేదికను ప్రభుత్వానికి ఈ వారంలోగా కలెక్టర్ పంపనున్నట్లు తెలిసింది.