Share News

ఇంటికో పారిశ్రామికవేత్త

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:20 AM

ప్రతి ఇంట ఒక ఐటీ నిపుణుడు. - ఇదీ గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆలోచనా విధానం. ఈ కార్యక్రమం ఎంత సత్ఫలితాన్నిచ్చిందో చూశాం. మరిప్పుడు.. ప్రతి ఇంటిలో పారిశ్రామిక వేత్త ఉండాలి. ప్రస్తుతం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం ఇది. దీని కార్యరూపం దాల్చేలా సీఎం, మంత్రి నారా లోకేశ్‌ పనిచేస్తున్నారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ఇంటికో పారిశ్రామికవేత్త
పారిశ్రామిక వేత్తలతో మంత్రి నిమ్మల రామానాయుడు

ఇదీ సీఎం చంద్రబాబు లక్ష్యం

మంత్రి నిమ్మల రామానాయుడు

పెళ్లకూరు, నవంబరు, 11 (ఆంధ్రజ్యోతి):

ప్రతి ఇంట ఒక ఐటీ నిపుణుడు.

- ఇదీ గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆలోచనా విధానం. ఈ కార్యక్రమం ఎంత సత్ఫలితాన్నిచ్చిందో చూశాం.

మరిప్పుడు..

ప్రతి ఇంటిలో పారిశ్రామిక వేత్త ఉండాలి.

ప్రస్తుతం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం ఇది. దీని కార్యరూపం దాల్చేలా సీఎం, మంత్రి నారా లోకేశ్‌ పనిచేస్తున్నారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెళ్లకూరు మండలం పాలచ్చూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీనివల్ల రాబోయే కాలంలో పేదరికమనేది కనిపించకుండా పోతుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తిరుపతిని మెగా సిటీతో పాటు ఆటోమొబైల్‌ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో యువత గంజాయి, డ్రగ్స్‌ బాట పడితే నేడు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తల కూడా సీబీఎన్‌ అంటే ఒక బ్రాండ్‌లా భావించి సీఎం మీద ఉన్న అపారమైన నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. దొరవారిసత్రం మండలంలోని తీర ప్రాంతాలలో చెక్‌డ్యాం, తడ మండలంలో గ్రాయిన్‌, పెళ్లకూరు మండలంలో చెంబేడు చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కోరారు. ఈ సందర్భంగా కొందరు పారిశ్రామిక వేత్తలు మంత్రిని కలిశారు.

Updated Date - Nov 12 , 2025 | 01:21 AM