9 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:24 AM
రేణిగుంటలోని విద్యుత్ ఉప కేంద్రంలో 100 వాట్ల నుంచి 160కి.. 360 వాట్ల నుంచి 420 వాట్లకు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచే పనులను గురువారం నుంచి 9వ తేదీ వరకు చేపడుతున్నారు.
రేణిగుంట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): రేణిగుంటలోని విద్యుత్ ఉప కేంద్రంలో 100 వాట్ల నుంచి 160కి.. 360 వాట్ల నుంచి 420 వాట్లకు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచే పనులను గురువారం నుంచి 9వ తేదీ వరకు చేపడుతున్నారు. ఈ పనులు జరిగేటప్పుడు అత్యవసర సమయంలో కరెంటు సరఫరా ఆపనున్నట్లు టాన్స్‌కో ఏఈ(ఆపరేషన్స్) శ్రీనివాసన్ తెలిపారు. దీంతో 9వ తేది వరకు రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.