Share News

విద్యాశాఖలో అంతర్‌ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:22 AM

విద్యాశాఖలో అంతర్‌ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, ఎంఈవోల స్థాయికి సంబంధించి మొత్తం 32 మంది అంతర్‌ జిల్లాల బదిలీలకు అర్హత సాధించారు.

విద్యాశాఖలో అంతర్‌ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్‌

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో అంతర్‌ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, ఎంఈవోల స్థాయికి సంబంధించి మొత్తం 32 మంది అంతర్‌ జిల్లాల బదిలీలకు అర్హత సాధించారు. వీరిలో ఎంఈవో స్థాయి వారికి కడప ఆర్జేడీ బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించగా, మిగిలిన 30 మందికి జిల్లా కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మధ్యాహ్నం ప్రారంభమైన కౌన్సెలింగ్‌ ప్రక్రియ రాత్రి 8.30 గంటల వరకు సాగింది. విద్యాశాఖ ఏడీలు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 01:23 AM