Share News

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , Publish Date - May 12 , 2025 | 01:42 AM

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

29,871 మందికి 64 కేంద్రాల ఏర్పాటు

తిరుపతి(విద్య), మే 11(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 24,336 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,535 మంది చొప్పున 29,871 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారని ఆర్‌ఐవో జి.వి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వీరికి 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో తిరుపతి నగరంలోనే 20 ఉన్నాయి. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల ప్రాంతాలకు ప్రయాణించొచ్చు. ఇక, అరగంట ముందునుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

Updated Date - May 12 , 2025 | 01:42 AM