విజిలెన్సుతో కలిసి చెవిరెడ్డి కార్యాలయంలో తనిఖీలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:13 AM
మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న ‘సిట్’ అధికారులు బుధవారం తిరుపతికి వచ్చారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే అరెస్టయిన చంద్రగిరి మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇంట్లో తనిఖీల నిమిత్తం అదనపు ఎస్పీ నేతృత్వంలోని 15 మంది వచ్చారు. వీరికి సహాయంగా విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో సిబ్బందిని తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. తనిఖీల్లో ఏ ఆధారాలు లభిస్తాయి.. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. సిట్ అధికారులు తొలుత తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని కేవీఎస్ రియల్ ఎస్టేట్ కార్యాలయానికి చేరుకుని దాదాపు గంట పాటు తనిఖీలు జరిపారు. అక్కడ చెవిరెడ్డికి సంబంధించిన కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటప్రాంతంలో తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని 1-4 డోర్ నెంబరులోని చెవిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లోనే కార్యాలయమూ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమీపంలోనే ఉంటున్న చెవిరెడ్డి తల్లి, సోదరుడు రఘునాధరెడ్డి తదితరులతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నమే చెవిరెడ్డి సతీమణి, కుమారులు హైదరాబాదు వెళ్ళినట్టు తెలిసి వారితోనే ఫోన్ చేయించి ఇంట్లో తనిఖీలు చేపట్టాల్సి వుందని సమాచారం అందజేశారు. తాము రావడానికి రాత్రి 10 గంటలు అవుతుందని, అప్పటి దాకా గడువు ఇవ్వాలని వారు కోరినట్టు తెలిసింది. సాయంత్రం నాలుగున్నర తర్వాత ఆ ఇంటి నుంచి అధికారులు వెనుదిరిగారు. మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి, చిత్తూరుతో పాటు పలు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. కాగా, రికార్డుల్లో ఉన్న కంపెనీ పేర్లకు.. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న కంపెనీల పేర్లు వేర్వేరుగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా చెవిరెడ్డి ఆర్థిక లావాదేవీలను సిట్ పరిశీలించనున్నట్లు తెలిసింది. నేడూ కొనసాగనున్న తనిఖీలు
తిరుపతి (నేరవిభాగం), ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న ‘సిట్’ అధికారులు బుధవారం తిరుపతికి వచ్చారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే అరెస్టయిన చంద్రగిరి మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇంట్లో తనిఖీల నిమిత్తం అదనపు ఎస్పీ నేతృత్వంలోని 15 మంది వచ్చారు. వీరికి సహాయంగా విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో సిబ్బందిని తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. తనిఖీల్లో ఏ ఆధారాలు లభిస్తాయి.. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. సిట్ అధికారులు తొలుత తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని కేవీఎస్ రియల్ ఎస్టేట్ కార్యాలయానికి చేరుకుని దాదాపు గంట పాటు తనిఖీలు జరిపారు. అక్కడ చెవిరెడ్డికి సంబంధించిన కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటప్రాంతంలో తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని 1-4 డోర్ నెంబరులోని చెవిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లోనే కార్యాలయమూ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమీపంలోనే ఉంటున్న చెవిరెడ్డి తల్లి, సోదరుడు రఘునాధరెడ్డి తదితరులతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నమే చెవిరెడ్డి సతీమణి, కుమారులు హైదరాబాదు వెళ్ళినట్టు తెలిసి వారితోనే ఫోన్ చేయించి ఇంట్లో తనిఖీలు చేపట్టాల్సి వుందని సమాచారం అందజేశారు. తాము రావడానికి రాత్రి 10 గంటలు అవుతుందని, అప్పటి దాకా గడువు ఇవ్వాలని వారు కోరినట్టు తెలిసింది. సాయంత్రం నాలుగున్నర తర్వాత ఆ ఇంటి నుంచి అధికారులు వెనుదిరిగారు. మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి, చిత్తూరుతో పాటు పలు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. కాగా, రికార్డుల్లో ఉన్న కంపెనీ పేర్లకు.. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న కంపెనీల పేర్లు వేర్వేరుగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా చెవిరెడ్డి ఆర్థిక లావాదేవీలను సిట్ పరిశీలించనున్నట్లు తెలిసింది.
నేడూ కొనసాగనున్న తనిఖీలు
బుధవారం రాత్రి 9 గంటల వరకు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇంటి వద్దకు అతని కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. వీరు వచ్చాక గురువారం ఇంట్లో సోదాలు చేయనున్నారు. కాగా, చెవిరెడ్డి ఇంటివద్దకు సిట్, విజిలెన్సు బృందం చేరుకోగా.. వైసీపీకి చెందిన తిరుపతి రూరల్ ఎంపీపీ చంద్రమౌళిరెడ్డి, వైస్ ఎంపీపీ మాధవ రెడ్డి, సర్పంచులు కేశవులు, చిన్నియాదవ్, మైనారిటీ నాయకుడు కె.వలీ తదితరులు అక్కడకు చేరుకున్నారు.