Share News

కేంద్ర బృందంచే చెత్త నిర్వహణ ప్లాంట్ల పరిశీలన

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:19 AM

తిరుపతి కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న తూకివాకం, రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి (అమృత్‌ పథకం) ఇషా కాలియా, సాంకేతిక సలహాదారుడు రోహిత్‌ కక్కర్‌, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ కుమార్‌ గురువారం కమిషనర్‌ ఎన్‌.మౌర్యతో కలిసి పరిశీలించారు.

కేంద్ర బృందంచే చెత్త నిర్వహణ ప్లాంట్ల పరిశీలన

తిరుపతి, జూలై10(ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న తూకివాకం, రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి (అమృత్‌ పథకం) ఇషా కాలియా, సాంకేతిక సలహాదారుడు రోహిత్‌ కక్కర్‌, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ కుమార్‌ గురువారం కమిషనర్‌ ఎన్‌.మౌర్యతో కలిసి పరిశీలించారు. తూకివాకం వద్ద గల మురుగునీటి శుద్ధి కేంద్రం, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. మురుగునీరు శుద్ది చేసి ప్రైవేటు ఫ్యాక్టరీలకు, పంటలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్‌ వివరించారు. రామాపురంలో చెత్త నిర్వహణతో వచ్చిన ఎరువును పొలాలకు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను సిమెంట్‌ ఫ్యాక్టరీలకు విక్రయిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ ప్లాంట్‌ నిర్వహణపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అదనపు కమిషనర్‌ చరణ్‌ తేజ్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, ఎస్‌ఈ శ్యాంసుందర్‌, స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, మునిసిపల్‌ ఇంజినీర్లు తదితరులున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 02:19 AM