Share News

పంచమితీర్థం ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:25 AM

పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష ఘట్టమైన పంచమితీర్థం ఈనెల 25వ తేదీన జరుగనుంది. అమ్మవారి పుష్కరిణి పద్మసరోవరంలో జరిగే ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

పంచమితీర్థం ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ

తిరుచానూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష ఘట్టమైన పంచమితీర్థం ఈనెల 25వ తేదీన జరుగనుంది. అమ్మవారి పుష్కరిణి పద్మసరోవరంలో జరిగే ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా టీటీడీ, పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. శనివారం అమ్మవారి ఆలయ మాడవీధులతోపాటు పుష్కరిణిని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. పంచమితీర్థం విజయవంతానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని జేఈవో వీరబ్రహ్మం సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 01:25 AM