రూ.2వేల కోట్లతో పరిశ్రమలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:39 AM
జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రూ.2వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. నాయుడుపేట సెజ్ పరిధిలో రూ.200 కోట్ల పెట్టుబడులతో 3ఎక్స్‌ఫర్ ఇన్నోవేచర్ లిమిటెడ్ ఫార్మసుటికల్స్ ప్రారంభం కానుంది. ఇందులో 300మందికి పైగా ప్రత్యక్షంగా, మరో వందమందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. అక్కడే రూ.300 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారుచేసే దమ్ము బయో ఫ్యూయల్స్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. దీనిద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. తిరుపతి రూరల్ తిరుచానూరు వద్ద రూ.200కోట్లతో నిర్మితమైన కోర్టు యార్డు మారియట్ స్టార్ హోటల్ ప్రారంభం కానుంది.
రేపు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రూ.2వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. నాయుడుపేట సెజ్ పరిధిలో రూ.200 కోట్ల పెట్టుబడులతో 3ఎక్స్‌ఫర్ ఇన్నోవేచర్ లిమిటెడ్ ఫార్మసుటికల్స్ ప్రారంభం కానుంది. ఇందులో 300మందికి పైగా ప్రత్యక్షంగా, మరో వందమందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. అక్కడే రూ.300 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారుచేసే దమ్ము బయో ఫ్యూయల్స్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. దీనిద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. తిరుపతి రూరల్ తిరుచానూరు వద్ద రూ.200కోట్లతో నిర్మితమైన కోర్టు యార్డు మారియట్ స్టార్ హోటల్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 300మందికి ఉపాధి లభించనుంది. వీటితోపాటు సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరు, సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం శిరసనంబేడు, గూడూరు నియోజకవర్గం కొమ్మనెట్టూరులో ఎంఎ్‌సఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. తిరుచానూరు వద్ద మారియట్ హోటల్‌ను, నాయుడుపేట సెజ్‌లో దమ్ము బయో ఫ్యూయల్స్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించనున్నారు.