ఐఈఎస్‌లో మెరిసిన ఇందుమతి
ABN , Publish Date - Dec 20 , 2025 | 03:00 AM
చదువుకు పేదరికం అడ్డుకాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలకు తోడు, సరైన ప్రణాళికను ఆచరిస్తే చాలు. అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చని నిరూపించారు దాసరి ఇందుమతి. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసె్‌స(ఐఈఎస్) పరీక్షల్లో ఓసీ (ఈడబ్ల్యూఎ్‌స)కేటగిరీలో జాతీయ స్థాయి 75వ ర్యాంకు సాధించారు.
చదువుకు పేదరికం అడ్డుకాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలకు తోడు, సరైన ప్రణాళికను ఆచరిస్తే చాలు. అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చని నిరూపించారు దాసరి ఇందుమతి. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసె్‌స(ఐఈఎస్) పరీక్షల్లో ఓసీ (ఈడబ్ల్యూఎ్‌స)కేటగిరీలో జాతీయ స్థాయి 75వ ర్యాంకు సాధించారు.
- తిరుపతిరూరల్, ఆంధ్రజ్యోతి
తిరుపతి నగరం సింగాలగుంటకు చెందిన దాసరి కృష్ణమూర్తి లారీడ్రైవర్ (టీటీడీ ప్రొవిజన్స్ ట్రాన్స్‌పోర్ట్). మాధవి బర్డ్ ఆస్పత్రిలో ఓటీ అసిస్టెంట్. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఈ దంపతులు తమ కుమారుడు, కుమార్తెను ఉన్నత చదువులు చదివించారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ఇందుమతి చదువుపై ఆసక్తి పెంచుకుని టాపర్‌గా నిలుస్తూ వచ్చారు. టీటీడీ ఎస్జీఎస్ హైస్కూల్‌లో చదువుపై ఈమెకి ఉన్న ఇష్టాన్ని గమనించిన హెచ్‌ఎం కె.కృష్ణమూర్తి ప్రోత్సహించారు. పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంజినీరింగ్ కోర్సులు చదివేటప్పుడు ఫీజులకోసం ఆర్థికసాయం చేశారు. టెన్త్‌లో (2017-18) 9.7జీపీఏ, డిప్లొమాలో (2018-2021) 93శాతం, ఇంజినీరింగ్‌లో (2021-24) 90శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌లోలో టాప్‌పర్సంటైల్ మార్కులు సాధించి కాకినాడ జేఎన్‌టీయూ నుంచి గోల్డ్‌మెడల్ అందుకున్నారు. బాంబే అటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్)లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. ఇక, యూజీ ఇంజినీరింగ్(ఈఈఈ) పూర్తయిన వెంటనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తలుపుతట్టినా, కాదని యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఏడాదిపాటు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న ఇందుమతి.. ఆలిండియాలో 75వ ర్యాంకు పొందారు. వీటిలో రైల్వే, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇఈడీఎస్ ఉంటాయని.. తన ర్యాంకుకు వచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుంటానని ఇందుమతి చెప్పారు. తన చదువుకు సహాయంగా నిలిచిన హెచ్‌ఎం కె.కృష్ణమూర్తి, గుంటూరులోని ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్‌ఈ హెడ్ మల్లీశ్వరి, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెరుగైన ర్యాంకు సాధించినట్లు చెప్పారు. తొలుత ఉద్యోగంలో చేరి తన కుటుంబాన్ని సెటిల్ చేశాక, రెండు, మూడేళ్ల తర్వాత సివిల్ సర్వీసెస్ రాస్తానని తన లక్ష్యాన్ని చెప్పారామె.
ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచ్(ఈఈఈ, మెకానికల్, సివిల్)లు కష్టమని, ఉద్యోగాలు రావన్న అపోహతో చాలామంది వీటిని ఎంపిక చేసుకోవడం లేదు. పలు ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఇస్రోలోనూ కోర్‌బ్రాంచ్‌లు చదివిన వారికి మంచి ఉద్యోగావకాశాలున్నాయి. మిసైల్స్ తయారీలో ఈఈఈ చదివిన వారే కీలకం.
ఇంజినీరింగ్ కోర్ బ్రాంచ్‌లు చదివే విద్యార్థులు తొలి నుంచి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. టెక్నికల్‌గా సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి. యూపీఎస్సీ పరీక్షల్లో రాణించేందుకు అకడమిక్ పుస్తకాలు లేదా స్టాండర్డ్ బుక్స్ చదవాలి. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి.