పెరిగిన టమోటా ధరలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:09 AM
టమోటా ధరలు రెండు రోజులుగా పెరుగుతున్నాయి. మంగళవారం 15 కిలోల బాక్స్ ధర రూ.300కు చేరుకొంది. ధరలు లేని సమయంలో ఎండల తీవ్రతతో తోటల్లోనే కాయలు మాగిపోయి బాక్స్ రూ. 100కే అమ్మాల్సి వచ్చింది. ఒక్కో రైతు రోజుకు 300నుంచి 500 బాక్సులకు మించి కోతలు చేపట్టారు. మూడు నెలలుగా కోత కూలీ డబ్బు రాకపోవడంతో కోతలు ఆపేశారు. కూలీ డబ్బులు చేతి నుంచి చెల్లించి నష్టపోయారు. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో నాటిని తోటల నుంచి కోతలు వస్తున్నాయి. ఆ తోటల్లోనూ సగం కోతలు పూర్తి చేశారు. దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు ధరలు లేక నష్టపోయారు. అరకొరగా పంట ఉన్నప్పుడే ధరలు పెరగడంతో కొందరు మాత్రమే ఈ ధరలు పొందుతున్నారు. పలమనేరు, పుంగనూరు, కోలారు, మదనపల్లె తదితర టమోటా మార్కెట్లలో 15 కిలోల బాక్స్ రూ. 300 లకు మించి ధరలు పలుకుతున్నాయి.
సోమల, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):టమోటా ధరలు రెండు రోజులుగా పెరుగుతున్నాయి. మంగళవారం 15 కిలోల బాక్స్ ధర రూ.300కు చేరుకొంది. ధరలు లేని సమయంలో ఎండల తీవ్రతతో తోటల్లోనే కాయలు మాగిపోయి బాక్స్ రూ. 100కే అమ్మాల్సి వచ్చింది. ఒక్కో రైతు రోజుకు 300నుంచి 500 బాక్సులకు మించి కోతలు చేపట్టారు. మూడు నెలలుగా కోత కూలీ డబ్బు రాకపోవడంతో కోతలు ఆపేశారు. కూలీ డబ్బులు చేతి నుంచి చెల్లించి నష్టపోయారు. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో నాటిని తోటల నుంచి కోతలు వస్తున్నాయి. ఆ తోటల్లోనూ సగం కోతలు పూర్తి చేశారు. దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు ధరలు లేక నష్టపోయారు. అరకొరగా పంట ఉన్నప్పుడే ధరలు పెరగడంతో కొందరు మాత్రమే ఈ ధరలు పొందుతున్నారు. పలమనేరు, పుంగనూరు, కోలారు, మదనపల్లె తదితర టమోటా మార్కెట్లలో 15 కిలోల బాక్స్ రూ. 300 లకు మించి ధరలు పలుకుతున్నాయి.