Share News

పెరిగిన రిజిస్ట్రేషన్‌ రాబడి

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:14 AM

చిత్తూరు జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ రాబడి పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల కాలంలో వృద్ధిశాతం సైతం పెరిగింది.

పెరిగిన రిజిస్ట్రేషన్‌ రాబడి
చిత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ రాబడి పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల కాలంలో వృద్ధిశాతం సైతం పెరిగింది. కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం క్రమంగా ఊపందుకుంది. భూములు, స్థలాలపై ఎక్కువమంది పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవలి కాలంలో ఉత్సాహం చూపుతున్నారు.

జిల్లాలోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రాబడి లక్ష్యం రూ.90.54 కోట్లు నిర్దేశించగా రూ.64.17 కోట్లు సాధించి 70.87 వృద్ధి శాతం సాధించామని జిల్లా రిజిస్ర్టార్‌ వెంకటరమణ మూర్తి తెలిపారు. ఏప్రిల్‌లో రూ.17.45కోట్లకుగాను రూ.12.24 కోట్లు(70.15 శాతం), మే నెలలో రూ.15.27 కోట్లకు బదులు రూ.12.12 కోట్లు(79.41 శాతం), జూన్‌లో రూ17.45కోట్లకు బదులు రూ.13.79 కోట్లు(79.02 శాతం), జూలైలో రూ.22.91 కోట్లకు బదులు రూ.13.82 కోట్లు (60.32 శాతం) వసూలు జరిగిందని చెప్పారు. గత ఏడాది తొలి ఐదు నెలల కాలంలో రూ.57.35 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందన్నారు. లక్ష్యంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలవారీగా కుప్పం రూ.9.27 కోట్లకు బదులు రూ.9.44 కోట్లతో 101.81 శాతం వృద్ధి సాధించి ప్రథమ స్థానంలో నిలవగా రెండో స్థానంలో చిత్తూరు రూరల్‌ రూ.6.46 కోట్లకు బదులు రూ.5.99 కోట్లు (92.74 శాతం), నగరి రూ.5.97 కోట్లకు రూ.5.53 కోట్లు (92.58శాతం), పలమనేరు రూ.14.49 కోట్లకు రూ.12.91 కోట్లు (89.10 శాతం), బంగారుపాళ్యం రూ.4.75 కోట్లకు రూ.3.64 కోట్లు (76.63శాతం), పుంగనూరు రూ.12.77 కోట్లకు రూ.7.99 కోట్లు (62.54 శాతం), కార్వేటినగరం రూ.4.51 కోట్లకు రూ.2.37 కోట్లు (52.49 శాతం) సాధించగా, చిట్టచివరి స్థానంలో చిత్తూరు (ఆర్వో) రూ.32.28 కోట్లకుగాను రూ.16.28 కోట్లు వసూలు చేసి 50.43శాతంతో వెనుకబడిందన్నారు. జిల్లాలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 23,976 జరగ్గా, కుప్పం 5574 జరిపి ప్రథమ స్థానంలో నిలవగా, 4136తో పలమనేరు, 3956తో చిత్తూరు ఆర్వో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయన్నారు. 1364 డాక్యుమెంట్లతో చిట్టచివరిస్థానంలో నగరి నిలిచిందని వివరించారు.

Updated Date - Sep 09 , 2025 | 01:14 AM