Share News

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:04 AM

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 16వ తేదీన మంత్రిపై ఎక్స్‌ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఫొటోను మార్ఫింగ్‌ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణి పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై చిత్తూరు బీవీరెడ్డికాలనీకి చెందిన న్యాయవాది శ్రీనివాసబాబు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ మణికంఠ ఆదేశాలతో బుధవారం కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు.

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు

వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై కేసు నమోదు

చిత్తూరు అర్బన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 16వ తేదీన మంత్రిపై ఎక్స్‌ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఫొటోను మార్ఫింగ్‌ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణి పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై చిత్తూరు బీవీరెడ్డికాలనీకి చెందిన న్యాయవాది శ్రీనివాసబాబు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ మణికంఠ ఆదేశాలతో బుధవారం కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 18 , 2025 | 01:04 AM