ఏ రంగంలో.. ఏ స్థానం
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:20 AM
ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు, లక్ష్యం ఛేదనలో జిల్లా పనితీరు ఎలా ఉంది. ఆయా రంగాల్లో రాష్ట్రంలో ఏ స్థాయిలో నిలిచింది. ఈ వివరాలను విజయవాడలో కలెక్టర్ల సదస్సు సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో జిల్లాకు రూ.96 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటి ద్వారా ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. జిల్లా యంత్రాంగం 53 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుని రూ.39 వేల కోట్ల పెట్టుబడులను, 1.12 లక్షల ఉద్యోగాలను రాబట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అదనంగా మంత్రివర్గం ఇప్పటికే 24 సంస్థలకు సంబంధించి రూ.57 వేల కోట్ల పెట్టుబడులతో 76 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 77 సంస్థల నుంచీ జిల్లాకు రూ. 96 వేల కోట్ల పెట్టుబడులు, 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక, గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ జిల్లాలో 11,425 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఇందులో జిల్లాకు నాలుగో స్థానం లభించింది. ఈ జాబితాలో ప్రైవేటు ఉద్యోగాలే చూపారు. టీచర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీని చూపలేదు. ఫ ఒక్కో నియోజకవర్గంలో మూడు నెలలకు ఒక జాబ్ మేళా చొప్పున నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లెక్కన జిల్లాలో 49 మేళాలు నిర్వహించాలి. కానీ, జిల్లా యంత్రాంగం చొరవతో 72 మేళాలు నిర్వహించగా, 518 పరిశ్రమలు పాల్గొని 5677 ఉద్యోగాలు కల్పించాయి. ఇందులో జిల్లాకు ఏపీలో మూడో స్థానం వచ్చింది. ఫ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద లే అవుట క్రమబద్ధీకరణకు 8165 దరఖాస్తుల ద్వారా రూ.78.99 కోట్లు వసూలైంది. దీని అమల్లో జిల్లాకు మూడో స్థానం దక్కింది.
కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతి, అమలుపై వెల్లడి
త్వరలో రూ.96 వేల కోట్ల పెట్టుబడులు
గతేడాది నుంచి 11,425 మందికి ఉద్యోగావకాశాలు
తిరుపతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు, లక్ష్యం ఛేదనలో జిల్లా పనితీరు ఎలా ఉంది. ఆయా రంగాల్లో రాష్ట్రంలో ఏ స్థాయిలో నిలిచింది. ఈ వివరాలను విజయవాడలో కలెక్టర్ల సదస్సు సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో జిల్లాకు రూ.96 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటి ద్వారా ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. జిల్లా యంత్రాంగం 53 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుని రూ.39 వేల కోట్ల పెట్టుబడులను, 1.12 లక్షల ఉద్యోగాలను రాబట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అదనంగా మంత్రివర్గం ఇప్పటికే 24 సంస్థలకు సంబంధించి రూ.57 వేల కోట్ల పెట్టుబడులతో 76 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 77 సంస్థల నుంచీ జిల్లాకు రూ. 96 వేల కోట్ల పెట్టుబడులు, 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక, గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ జిల్లాలో 11,425 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఇందులో జిల్లాకు నాలుగో స్థానం లభించింది. ఈ జాబితాలో ప్రైవేటు ఉద్యోగాలే చూపారు. టీచర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీని చూపలేదు.
ఫ ఒక్కో నియోజకవర్గంలో మూడు నెలలకు ఒక జాబ్ మేళా చొప్పున నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లెక్కన జిల్లాలో 49 మేళాలు నిర్వహించాలి. కానీ, జిల్లా యంత్రాంగం చొరవతో 72 మేళాలు నిర్వహించగా, 518 పరిశ్రమలు పాల్గొని 5677 ఉద్యోగాలు కల్పించాయి. ఇందులో జిల్లాకు ఏపీలో మూడో స్థానం వచ్చింది.
ఫ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద లే అవుట క్రమబద్ధీకరణకు 8165 దరఖాస్తుల ద్వారా రూ.78.99 కోట్లు వసూలైంది. దీని అమల్లో జిల్లాకు మూడో స్థానం దక్కింది.
ఫ పాల దిగుబడుల ద్వారా రూ.4503 కోట్లు సాధించాలని ప్రభుత్వం టార్గెట్ విధించగా, ఇప్పటి వరకూ రూ. 2025 కోట్లు సాధించి 9వ స్థానంలో నిలిచింది.
ఫ ఈ ఏడాది పారిశ్రామిక రంగంలో ఉత్పత్తుల విలువ రూ.43,043 కోట్లుగా ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. తొలి రెండు క్వార్టర్లలో రూ. 19603 కోట్లు సాధించి జిల్లా పదో స్థానం దక్కించుకుంది.
ఫ మత్స్య పరిశ్రమ ద్వారా రూ.5035 కోట్ల విలువైన ఉత్పత్తులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యం ఇవ్వగా ఇప్పటికి రూ.1364 కోట్లు సాధించింది. దీనికి సంబంధించిన స్థూల ఉత్పత్తుల విలువలో పదో స్థానం దక్కించుకుంది.
ఫ పాడి పరిశ్రమ ద్వారా రూ.7870 కోట్ల విలువైన ఉత్పత్తులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇప్పటికి రూ.3534 కోట్ల ఉత్పత్తులతో 11వ స్థానంలో నిలిచింది.
ఫ ఈ ఏడాది రూ.2955 కోట్ల మాంసం ఉత్పత్తుల టార్గెట్ కాగా, ఆరు నెలల్లో రూ.1323 కోట్లు సాధించి 15వ స్థానంలో నిలిచింది.
ఫ ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల లక్ష్యంలో రూ.19,487 కోట్లకుగాను రూ.5658 కోట్లు సాధించింది. 21వ స్థానంలో నిలిచింది.
ఫ సేవా రంగం నుంచీ రూ.37,191 కోట్లకుగాను రూ.15,574 కోట్లు సాధించి జిల్లా 24వ స్థానానికి పరిమితమైంది.
ఫ 74,730 పక్కా ఇళ్లకుగాను 66,665 నిర్మాణం మొదలుకాగా.. 42,327 ఇళ్లు పూర్తి కావడంతో 14వ స్థానంలో నిలిచింది.
ఫ వ్యవసాయంలో సగటున డ్రోన్ల వినియోగం 50 గంటలుగా ఉందని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఈ విషయంలో జిల్లా 9వ స్థానంలో ఉంది.
ఫ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకూ 3565 మంది హాజరు నమోదు చేసుకోగా 1621 మంది నమోదు చేయలేదు. ఈ అంశంలో జిల్లా 7వ స్థానంలో ఉంది.
ఫ 86,141 బయో మెట్రిక్ అప్‌డేషన్ రికార్డులు పెండింగులో వుండగా ఈనెల 13 నాటికి 12,145 రికార్డులను అప్‌లోడ్ చేసి 22వ స్థానంలో నిలిచింది.
70.8 శాతం మందికి
వాట్సాప్ గవర్నెన్స్ తెలియదట
ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌కు అమిత ప్రాధాన్యత, ప్రాచుర్యం కల్పిస్తోంది. అయినా జిల్లాలో 70.8 శాతం మందికి దీని గురించి తెలియదు. ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అందులో భాగంగా మనమిత్ర గురించి తెలుసా తెలియదా అన్న ప్రశ్నకు కేవలం 29.2 శాతం మంది మాత్రమే తెలుసని చెప్పారు. మిగిలిన 70.8 శాతం మందికి తెలియదట. మనమిత్ర యాప్ 22.7 శాతం మందే వాడామని చెప్పారు. దీనిపై ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని 5258 మంది సచివాలయ ఉద్యోగుల్లో ఈనెల 13నాటికి 3512 మంది మాత్రమే ప్రారంభించారు.