రావు బాలసరస్వతి జ్ఞాపకాల్లో.....
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:31 AM
హైదరాబాదులో బుధవారం కన్నుమూసిన తొలి తరం సినీ నటి, నేపథ్య గాయని రావు బాలసరస్వతికి తిరుపతితో మంచి అనుబంధమే వుంది.చెన్నైలో వున్నప్పుడు అనేకమార్లు తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుపతి(విశ్వవిద్యాలయాలు),అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):హైదరాబాదులో బుధవారం కన్నుమూసిన తొలి తరం సినీ నటి, నేపథ్య గాయని రావు బాలసరస్వతికి తిరుపతితో మంచి అనుబంధమే వుంది.చెన్నైలో వున్నప్పుడు అనేకమార్లు తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ అనేక పాటలు పాడారు.వెంకటగిరి రాజవంశంలో పుట్టి తూర్పుగోదావరి జిల్లా కోలంక జమిందారు ఇంటికి దత్తు వెళ్లిన రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావును 1944వ సంవత్సరంలో వివాహమాడారు.2007లో తిరుపతిలో నిర్వహించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలతో పాటు 2009లో శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరై సన్మానాలందుకున్నారు.రావు బాలసరస్వతి మృతి పట్ల వెంకటగిరి రాజ వంశీకుడు, గేయధారతో ప్రఖ్యాతుడైన సాయికృష్ణ యాచేంద్ర సంతాపం వ్యక్తం చేశారు.1950వ సంవత్సరంలో వెంకటగిరిలో జరిగిన తన గేయధార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు.