శ్రీవారి ఆలయం ముందు రంగనాథ మండపం
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:51 AM
వైకుంఠద్వార దర్శనాల కోసం తిరుమలకు వచ్చే భక్తులను ఆకట్టుకునేలా శ్రీవారి ఆలయం ముందు టీటీడీ ‘రంగనాథమండపం’ సెట్ వేస్తోంది. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల సందర్శన కోసం వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో ప్రత్యేక సెట్టింగ్‌ను ఏర్పాటు చేయడం అనవాయితీ. దాతల సహకారంతో ఇందుకోసం దాదాపు రూ.40 లక్షలు వెచ్చిస్తున్నారు. బెంగుళూరు నుంచి వచ్చిన 50 మంది నిపుణులు ఈ ఏర్పాట్లలో ఉన్నారు. ఇందులో రంగనాథ స్వామితో పాటు అష్టలక్ష్మీ, దశావతారాల విగ్రహాలు ఉంటాయి. ఇక, దర్శనానికి వెళ్లిలేకపోయిన భక్తుల సందర్శన కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారంరోజుల కిందట మొదలైన ఈ పనులు ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయి. సోమవారం సాయంత్రానికి విద్యుత్, పుష్పాలంకరణలో మండపం పూర్తిగా సిద్దం కానుంది.
తిరుమల, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): వైకుంఠద్వార దర్శనాల కోసం తిరుమలకు వచ్చే భక్తులను ఆకట్టుకునేలా శ్రీవారి ఆలయం ముందు టీటీడీ ‘రంగనాథమండపం’ సెట్ వేస్తోంది. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల సందర్శన కోసం వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో ప్రత్యేక సెట్టింగ్‌ను ఏర్పాటు చేయడం అనవాయితీ. దాతల సహకారంతో ఇందుకోసం దాదాపు రూ.40 లక్షలు వెచ్చిస్తున్నారు. బెంగుళూరు నుంచి వచ్చిన 50 మంది నిపుణులు ఈ ఏర్పాట్లలో ఉన్నారు. ఇందులో రంగనాథ స్వామితో పాటు అష్టలక్ష్మీ, దశావతారాల విగ్రహాలు ఉంటాయి. ఇక, దర్శనానికి వెళ్లిలేకపోయిన భక్తుల సందర్శన కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారంరోజుల కిందట మొదలైన ఈ పనులు ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయి. సోమవారం సాయంత్రానికి విద్యుత్, పుష్పాలంకరణలో మండపం పూర్తిగా సిద్దం కానుంది.