Share News

ఇలాగైతే అవినీతి ఎలా వెలుగు చూస్తుంది?

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:49 AM

పుత్తూరు మున్సిపాలిటీలో అప్పటి పాలకులు ప్రతి పనిలో దోపిడీకి పాల్పడ్డారు. కౌన్సిల్‌ సమ్మతి లేకుండా, టెండర్లు పిలవకుండా చాలా పనులు చేశారు. నిబంధనలను పాటించలేదు. ఇలా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై కమిషన్‌ వేసినందుకు మంత్రికి ధన్యవాదాలు. అయితే, అక్రమాలు జరిగాయని చెబుతున్న కాలంలో పనిచేసిన వారే ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇలాగైతే అక్రమాలు ఎలా వెలుగు చూస్తాయి? చిత్తశుద్ధి కలిగిన వారిని విచారణాధికారులుగా నియమించాలి.

ఇలాగైతే అవినీతి   ఎలా వెలుగు చూస్తుంది?

పుత్తూరు మున్సిపాలిటీలో అప్పటి పాలకులు ప్రతి పనిలో దోపిడీకి పాల్పడ్డారు. కౌన్సిల్‌ సమ్మతి లేకుండా, టెండర్లు పిలవకుండా చాలా పనులు చేశారు. నిబంధనలను పాటించలేదు. ఇలా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై కమిషన్‌ వేసినందుకు మంత్రికి ధన్యవాదాలు. అయితే, అక్రమాలు జరిగాయని చెబుతున్న కాలంలో పనిచేసిన వారే ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇలాగైతే అక్రమాలు ఎలా వెలుగు చూస్తాయి? చిత్తశుద్ధి కలిగిన వారిని విచారణాధికారులుగా నియమించాలి.

- గాలి భానుప్రకాష్‌, నగరి ఎమ్మెల్యే

ప్రాథమిక విచారణ పూర్తయింది

పుత్తూరు మున్సిపాలిటీలో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ రిపేర్‌ పనలుకు టెండర్లు పిలవకుండా రూ.45.82 లక్షలకు శ్రీహర్ష ఎర్త్‌ మూవర్స్‌కు నామినేషన్‌ పద్ధతిన అప్పగించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. రూ.5.9 లక్షలకు కాలువలు శుభ్రపరిచే పనులను 32 వర్క్‌లుగా విభజించి.. ఒకేరోజు పేమెంట్‌ చేశారు. రూ.2.5 లక్షల స్వచ్ఛభారత్‌ పెయింటింగ్‌ పనిని 15 వర్క్‌లుగా విభజించారు. మొదటి సారి స్ర్కాప్‌ను రూ.3.8 లక్షలకు అమ్మారు. ఆర్డీ విచారణలో ఎస్టిమేషన్‌ తయారీ, టెక్నికల్‌ ఆమోదం, టెండర్‌ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌, వర్క్‌ ఆర్డర్‌ ఇష్యూ, ఎంబుక్‌ నమోదు, థర్డ్‌పార్టీ కంట్రోల్‌ వంటివి లేవని తేలింది. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ పూర్తయింది. మున్సిపల్‌ కార్యాలయం, డంపింగ్‌ యార్డ్‌, 14వ ఆర్థిక సంఘం తదితర అంశాలపై ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ కోరిన విధంగా విచారణ చేయిస్తాం. 2019-24 కాలంలో పనిచేసిన అధికారులకు విచారణ విధులు కేటాయించం.

- మంత్రి నారాయణ స్పందన

జగనన్న కాలనీ అక్రమాలపై విచారణ జరిపించండి

వెంకటగిరిలోని జగనన్న కాలనీలో వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా ప్లాట్లు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారు. అలాగే, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపి టిడ్కో ద్వారా 2400 పేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు. సామాజిక అవసరాలకోసం కొంత స్థలాన్ని వదిలి పెట్టారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే ఆ స్థలంలో 111 మంది అనర్హులకు ప్లాట్లు కేటాయించారు. వీటన్నిటిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించండి.

- కురుగొండ్ల రామకృష్ణ, వెంకటగిరి

స్వర్ణముఖి నదికి

‘గంగ’ను వదలండి

ఎండాకాలం స్వర్ణముఖినది ఎండిపో తుంది. దీనివల్ల పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం.. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు, వాకాడు మండలాల్లో సుమారు 65 గ్రామాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఏటా తెలుగు గంగ కాలువ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

- నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే

రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమల బస్సులు నడపాలి

గూడూరు రైల్వే జంక్షన్‌. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పలు రైళ్లలో గూడూరుకు వచ్చి.. బస్సులలో తిరుమలకు వెళ్తుంటారు. వీరికోసం గతంలో గూడూరు రైల్వేస్టేషన్‌ నుంచీ తిరుమలకు బస్సులు నడిపేవారు. గత వైసీపీ ప్రభుత్వం వీటిని నిలిపేసింది. వీటిని పునరుద్ధరించాలి.

- పాశిం సునీల్‌ కుమార్‌, గూడూరు ఎమ్మెల్యే

వైసీపీ పాలనలో మైనార్టీల అభివృద్ధి శూన్యం

గత పాలకులు మైనార్టీలపై తీవ్ర వివక్ష చూపారు. కనీస సౌకర్యాలు లేకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మైనార్టీ ప్రార్థనా మందిరాలు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. మైనార్టీల ప్రార్థనా మందిరాల నిర్వహణ కోసం కూటమి ప్రభుత్వం వార్షిక నిధులు మంజూరు చేయడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుంది. మైనార్టీ ప్రజలకు ముందస్తు రంజాన్‌ శుభాకాంక్షలు.

- బొజ్జల సుధీర్‌ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

మంజూరైన సబ్‌స్టేషన్లకు టెండర్లు పిలవాలి

పిచ్చాటూరు మండలం ముడియూరు, సత్యవేడు మండలం చమర్తికండ్రిగలకు కొత్తగా సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయాలి. పిచ్చాటూరు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల్లో బా లికోన్నత పాఠశాలలను ఏర్పాటు చేయా లి. నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అర్ధంతరంగా ఆగిన అదనపు తరగతి గదుల పనులను పూర్తి చేయాలి.

- కోనేటి ఆదిమూలం, సత్యవేడు ఎమ్మెల్యే

Updated Date - Mar 12 , 2025 | 01:49 AM