అనుమానముంటే వేలి ముద్ర వేయాల్సిందే
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:15 AM
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరగాళ్లు పోలీసులను ఏమార్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మరోవైపు పోలీసులూ వారిని పట్టుకునేందుకు.. భవిష్యత్తులో దొంగతనాలకు పాల్పడినా గుర్తించేలా సాంకేతికతను అంది పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఫాపిలాన్, లైవ్ స్కానర్ల ద్వారా వేలి ముద్రలు, అరచేతి ముద్రలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు నేరగాళ్లను గుర్తించడంలో పోలీసులకు సహాయ పడుతున్నాయి. గతంలో వేలి ముద్రలు సేకరించే పనులు చాలా మందకొడిగా సాగేవి. ఇటీవల నేరాలు పెరగడం, గంజాయి, బహిరంగంగా మద్యం తాగడం, మహిళలు, వేధింపులు, చిన్నారులపై అఘాయిత్యాలు, ఇంటి దొంగతనాలు, దోపిడీలు, ద్విచక్ర వాహనాల చోరీ, బస్టాండు, రైల్వే స్టేషన్‌లో చైన్ స్నాచింగ్‌లు, పిక్‌ప్యాకెట్లు పెరిగాయి. ఫాఫిలాన్‌తో పాటు లైవ్ స్కానర్లను వినియోగించి ఈ ఘటనల్లో నిందితులను గుర్తించే పనులు చేపట్టారు. అదే సమయంలో అనుమానితుల వేలి ముద్రలు సేకరించే పనులూ సాగుతున్నాయి. గత నెలలో దాదాపు 1650 మంది వేలి ముద్రలు సేకరించారు. ఇలా వేలి ముద్రల సేకరణలో రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఎస్పీ హర్షవర్ధన్‌కు డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా అభినందనలు తెలుపుతూ కీపిటప్ అని ప్రశంసించారు.
- గత నెలలో 1650 మంది నుంచి సేకరించిన పోలీసులు
- నిందితుల గుర్తింపులో కీలకంగా పాఫిలాన్, లైవ్ స్కానర్లు
ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపించారంటే చాలు.. పోలీసులు వారి వేలి ముద్రలు సేకరిస్తున్నారు. అలాగే, పాఫిలాన్, లైవ్ స్కానర్ల ద్వారా వేలి ముద్ర వేయగానే ఆ వ్యక్తులకు నేరచరిత్ర ఉంటే తెలిసిపోతుంది. ఇక, నేరఘటనల్లో వేలిముద్రలను ట్యాలీ చేసి నిందితులను పట్టుకునేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇటీవల మధ్యప్రదేశ్ గ్యాంగ్‌ను తిరుపతి పోలీసులు ఇలాగే పట్టుకున్నారు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరగాళ్లు పోలీసులను ఏమార్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మరోవైపు పోలీసులూ వారిని పట్టుకునేందుకు.. భవిష్యత్తులో దొంగతనాలకు పాల్పడినా గుర్తించేలా సాంకేతికతను అంది పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఫాపిలాన్, లైవ్ స్కానర్ల ద్వారా వేలి ముద్రలు, అరచేతి ముద్రలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు నేరగాళ్లను గుర్తించడంలో పోలీసులకు సహాయ పడుతున్నాయి. గతంలో వేలి ముద్రలు సేకరించే పనులు చాలా మందకొడిగా సాగేవి. ఇటీవల నేరాలు పెరగడం, గంజాయి, బహిరంగంగా మద్యం తాగడం, మహిళలు, వేధింపులు, చిన్నారులపై అఘాయిత్యాలు, ఇంటి దొంగతనాలు, దోపిడీలు, ద్విచక్ర వాహనాల చోరీ, బస్టాండు, రైల్వే స్టేషన్‌లో చైన్ స్నాచింగ్‌లు, పిక్‌ప్యాకెట్లు పెరిగాయి. ఫాఫిలాన్‌తో పాటు లైవ్ స్కానర్లను వినియోగించి ఈ ఘటనల్లో నిందితులను గుర్తించే పనులు చేపట్టారు. అదే సమయంలో అనుమానితుల వేలి ముద్రలు సేకరించే పనులూ సాగుతున్నాయి. గత నెలలో దాదాపు 1650 మంది వేలి ముద్రలు సేకరించారు. ఇలా వేలి ముద్రల సేకరణలో రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఎస్పీ హర్షవర్ధన్‌కు డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా అభినందనలు తెలుపుతూ కీపిటప్ అని ప్రశంసించారు.
ఫ ఇటీవల తిరుచానూరు, తిరుపతి ఈస్ట్ పరిధిలో జరిగిన మారుతీ షోరూముల్లో దోపిడీ ఘటనల్లో వేలి ముద్రల ఆధారంగానే మధ్యప్రదేశ్ గ్యాంగ్‌ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
ఫ తిరుపతిలోని విష్ణునివాసంలో రోజూ 20 నుంచి 30 మొబైల్ ఫోన్లు, బంగారు నగలు, విలువైన వస్తువులు చోరీకి గురయ్యేవి. బాధితులు ఫిర్యాదు ఇవ్వడం తప్ప న్యాయం జరిగిన ఘటనలు చాలా తక్కువ. ఈ క్రమంలో విష్ణునివాసంలో లైవ్ స్కానర్ ఏర్పాటు చేసి అనుమానితులు, పాత నేరస్థుల వేలి ముద్రలు సేకరించే పనులు చేపట్టారు. ఇలా విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద వారం కిందట 15 మందిని ఒకసారి, ఐదుగురిని మరోసారి గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 20 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. దీంతో అక్కడ దొంగతనాలు తగ్గు ముఖం పట్టాయి.
జిల్లాలో 13,187 సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్స్, ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, మారుమూల పల్లెలు, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు నెలలుగా దాదాపు 13,187 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా గరుడ ఫైఓవర్‌పై ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగి పోవడం, ఆకతాయిల ఆగడాలు ఎక్కువ కావడం, అర్ధరాత్రి పూట మత్తు పదార్థాల వినియోగం పెరగడంతో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో ఇంకా కీలకమైన ప్రదేశాల్లో అమర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో భిక్షగాళ్ళ సందడి, నేరస్థుల కదలికలు తగ్గుముఖం పట్టాయి. విష్ణునివాసంలో బంగారం ఉండే బ్యాగు తీసుకెళ్తుంటే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకున్నారు.