Share News

మన్నించు ముక్కంటీశా..!

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:53 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల పవిత్రమైన శయనమందిరాన్ని కొందరు అక్రమార్కులు వసూళ్ల కేంద్రంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఆలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు తెర వేసిన తర్వాత ఏకాంత సేవ నిర్వహిస్తుంటారు. ముందుగా మూలమూర్తులకు తెరవేసిన తరువాత స్వామి అమ్మవార్లను వెండిపల్లకీలో కొలువుదీర్చి ఆలయంలో ప్రాకారంగా ఊరేగిస్తారు. ఆ తరువాతస్వామి అమ్మవార్లు అమ్మవారి సన్నిధిలోని శయనమందిరం వద్దకు చేరుకుంటారు. శయనపాన్పు సుందరంగా సుగంధ పరిమళాలు వెదజల్లేపుష్పలతో అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువుదీర్చుతారు. రాత్రి అక్కడ మళ్లీ నైవేద్య హారతులు సమర్పించి శయనమందిరంలో స్వామి అమ్మవార్లను ఏకాంతంగా నిద్రపుచ్చుతారు. ఆ తరువాత భక్తులందరిని వెలుపలకుపంపి ఆలయం మూసివేస్తారు.

మన్నించు ముక్కంటీశా..!
ఆలయంలోని శయనమందిరం

- వసూళ్ల కేంద్రంగా శ్రీకాళహస్తీశ్వరాలయ శయనమందిరం

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల పవిత్రమైన శయనమందిరాన్ని కొందరు అక్రమార్కులు వసూళ్ల కేంద్రంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఆలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు తెర వేసిన తర్వాత ఏకాంత సేవ నిర్వహిస్తుంటారు. ముందుగా మూలమూర్తులకు తెరవేసిన తరువాత స్వామి అమ్మవార్లను వెండిపల్లకీలో కొలువుదీర్చి ఆలయంలో ప్రాకారంగా ఊరేగిస్తారు. ఆ తరువాతస్వామి అమ్మవార్లు అమ్మవారి సన్నిధిలోని శయనమందిరం వద్దకు చేరుకుంటారు. శయనపాన్పు సుందరంగా సుగంధ పరిమళాలు వెదజల్లేపుష్పలతో అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువుదీర్చుతారు. రాత్రి అక్కడ మళ్లీ నైవేద్య హారతులు సమర్పించి శయనమందిరంలో స్వామి అమ్మవార్లను ఏకాంతంగా నిద్రపుచ్చుతారు. ఆ తరువాత భక్తులందరిని వెలుపలకుపంపి ఆలయం మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజు ఉదయం శయనమందిరం వద్ద సుప్రభాతం, గోపూజ నిర్వహించి స్వామి అమ్మవార్లను మేకొల్పుతారు. ఆపై స్వామి అమ్మవార్లు వారి గర్భాలయాలకు చేరుకున్న తరువాత మూలమూర్తుల దర్శనం ఆరంభమవుతుంది. రోజు స్వామి అమ్మవార్లు శయనించే పాన్పును పరమపవిత్రంగా భావించాలి. కానీ అమ్మవారి గర్భగుడి ఎదుటే ఉన్న శయనమందిరాన్ని పగలు మొత్తం యధేచ్చగా తెరచి ఉంచుతున్నారు. అంతే కాకుండా శయనమందిరంలోకి భక్తులు వచ్చి దక్షిణ సమర్పించాలంటూ బాహాటంగా చప్పట్లు కొట్టి మరీ పిలుస్తున్నారు. గురువారం ఓ సెక్యూరిటీగార్డు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను ముందుగా శయనమందిరంలోకి వెళ్లాలంటూ అరచి చెప్పడంపై కొందరు భక్తులు నిలదీశారు. పవిత్రమైన శయనపాన్పును భక్తులందరూ లోపలకు వెళ్లి సృశించడం శిరస్సుతో తాకి మొక్కడంపై కొందరు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. శయనపాన్పు పక్కనే కొందరు నిలబడి భక్తుల నుంచి నగదు వసూలు చేయడం గమనార్హం. ఈ శయన పాన్పు దందా రెండేళ్ల క్రితం విచ్చలవిడిగా జరిగేది. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలతో ఆ దందాకు స్వస్తిపడింది.మళ్లీ కొద్దిరోజులుగా పాత విధానానికి కొందరు అక్రమార్కులుతెరతీశారు. సంబంధిత అధికారులు స్పందించి కట్టడి చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 01:53 AM