నాకు పని చేయడమే తెలుసు
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:50 AM
‘నాకు నిత్యం పనిచేయడమే తెలుసు. ప్రచారం చేసుకోవడం తక్కువ. చాలా దూరదృష్టితో పటిష్ట నిర్ణయాలు తీసుకుని అయుమమలు చేశాం. టీటీడీ అంటే మినీ గవర్నమెంట్. తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు ఉంటాయి. ఈ రెండిటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. టీటీడీలో పనిచేయడం ఎన్నోజన్మల పుణ్యఫలం’ అని బదిలీపై వెళుతున్న ఈవో శ్యామలరావు అన్నారు. తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగులో మంగళవారం సాయంత్రం జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. లోపాలను సవరించుకుంటూ మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారాన్ని మరువలేనిదన్నారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలోపెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా వ్యవస్థలను తీసుకొచ్చామన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలోని ఉన్నతాధికారులు, అధికారులు శ్యామలరావు సేవలను కొనియాడారు. తిరుమల, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం ఆలయాల అర్చకులు ఈవోకు వేదాశీర్వచనం చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
టీటీడీలో బాధ్యతల నిర్వహణ ఎన్నోజన్మల పుణ్యఫలం
సన్మాన సభలో ఈవో శ్యామలరావు
తిరుమల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘నాకు నిత్యం పనిచేయడమే తెలుసు. ప్రచారం చేసుకోవడం తక్కువ. చాలా దూరదృష్టితో పటిష్ట నిర్ణయాలు తీసుకుని అయుమమలు చేశాం. టీటీడీ అంటే మినీ గవర్నమెంట్. తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు ఉంటాయి. ఈ రెండిటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. టీటీడీలో పనిచేయడం ఎన్నోజన్మల పుణ్యఫలం’ అని బదిలీపై వెళుతున్న ఈవో శ్యామలరావు అన్నారు. తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగులో మంగళవారం సాయంత్రం జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. లోపాలను సవరించుకుంటూ మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారాన్ని మరువలేనిదన్నారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలోపెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా వ్యవస్థలను తీసుకొచ్చామన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలోని ఉన్నతాధికారులు, అధికారులు శ్యామలరావు సేవలను కొనియాడారు. తిరుమల, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం ఆలయాల అర్చకులు ఈవోకు వేదాశీర్వచనం చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
టీటీడీ ఈవోగా నేడు
సింఘాల్ బాధ్యతల స్వీకరణ
టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీకి బదిలీ చేయడంతో పాటు ఆస్థానంలో గతంలో ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్‌ను మళ్లీ ఈవోగా నియమించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం ఉదయం 11-11.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో సింఘాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే టీటీడీ బోర్డు ఎక్స్‌ఆఫిషియో సభ్యుడిగానూ బాధ్యతలు తీసుకుంటారు.