అతడి అక్రమార్జన రూ.2.7 కోట్లు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:37 AM
చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా మహేశ్వరయ్య ఓ బిల్లు చెల్లింపునకు చిన్నగొట్టిగల్లు మండలం పాలెం గ్రామానికి చెందిన దినే్‌షరెడ్డిని నగదు డిమాండు చేశారు. ఆయన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు గత ఫిబ్రవరిలో రంగంలోకి దిగారు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా మహేశ్వరయ్యను పట్టుకుని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఆయన్ను సస్పెండు చేసింది. ఇటీవల బెయిల్‌పై వచ్చారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులను మహేశ్వరయ్య కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో తిరుపతి ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పలమనేరు, గంగవరం, కడప జిల్లా బద్వేలు, బెంగళూరులో మంగళవారం సోదాలు జరిపారు. బుధవారమూ కొన్నిచోట్ల ఈ తనిఖీలు జరిగాయి. తిరుపతి రూరల్ పేరూరులోని ఆయన ఇంట్లో మొత్తం ఒకటిన్నర కిలో బంగారం, కిలో వెండి, రూ.35 లక్షల బ్యాంకు టర్మ్ డిపాజిట్లు, రూ.ఎనిమిది లక్షల నగదు గుర్తించి.. సీజ్ చేశారు. ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

- ఏసీబీ సోదాల్లో తేలిందన్న అధికారులు
- పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య అరెస్టు
- రెండో రోజూ కొనసాగిన తనిఖీలు
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 9 (ఆంధ్రు సోదాల్లో ఇప్పటి వరకు అతడు 2,70,62,206 రూపాయలు అక్రమార్జనకు పాల్పడినట్లు తేలిందని బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా మహేశ్వరయ్య ఓ బిల్లు చెల్లింపునకు చిన్నగొట్టిగల్లు మండలం పాలెం గ్రామానికి చెందిన దినే్‌షరెడ్డిని నగదు డిమాండు చేశారు. ఆయన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు గత ఫిబ్రవరిలో రంగంలోకి దిగారు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా మహేశ్వరయ్యను పట్టుకుని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఆయన్ను సస్పెండు చేసింది. ఇటీవల బెయిల్‌పై వచ్చారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులను మహేశ్వరయ్య కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో తిరుపతి ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పలమనేరు, గంగవరం, కడప జిల్లా బద్వేలు, బెంగళూరులో మంగళవారం సోదాలు జరిపారు. బుధవారమూ కొన్నిచోట్ల ఈ తనిఖీలు జరిగాయి. తిరుపతి రూరల్ పేరూరులోని ఆయన ఇంట్లో మొత్తం ఒకటిన్నర కిలో బంగారం, కిలో వెండి, రూ.35 లక్షల బ్యాంకు టర్మ్ డిపాజిట్లు, రూ.ఎనిమిది లక్షల నగదు గుర్తించి.. సీజ్ చేశారు. ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలుచోట్ల ఆస్తులకు సంబంధించి 20 నుంచి 25 డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. బంధువులు, స్నేహితులు బినామీలుగా పలు బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్నట్లు గుర్తించిన వీరు.. త్వరలో వాటిని తెరిచేందుకు చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శిగా నెలవారీ జీతం తక్కువగా ఉన్నా.. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉన్నట్లు గుర్తించారు. అక్రమార్జనకు పాల్పడినట్లు తేలడంతో మహేశ్వరయ్యను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన్ను మళ్లీ కస్టడీకి తీసుకుని విచారించడానికి అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం.
అవినీతి అధికారుల సమాచారమివ్వండి
అధికారులు ఎవరైనా లంచం అడిగితే తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయండి. అలాగే, ఆదాయానికి మించి ఆస్తులున్న వారి వివరాలనూ మా దృష్టికి తీసుకురండి. సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. లంచం ఇస్తే కానీ పనులు చేయమని చెబుతున్న అధికారుల వివరాలు చెబితే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అవినీతి జరిగినా 94404 41630 నెంబరులో ఏఎస్పీ విమలకుమారిని.. లేదా 94404 41690 నెంబరులో డీఎస్పీ జస్సి ప్రశాంతిని సంప్రదించండి. ప్రజల సహకారం ఉంటేనే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవచ్చు.
- ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి