వైకుంఠ ఏకాదశిపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:09 AM
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తిరుమలలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరుకానున్నారు.
హాజరుకానున్న మంత్రులు అనిత, ఆనం, అనగాని
తిరుపతి(కలెక్టరేట్)/తిరుమల, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తిరుమలలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరుకానున్నారు. గత ఏడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ ప్రక్రియలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం తిరుమలలో టీటీడీ అధికారులు, కలెక్టర్, ఎస్పీలతో మంత్రులు సమావేశం కానున్నారు. రాత్రి మంత్రులు తిరుమలలోనే బసచేసి మంగళవారం ఉదయం కోయిల్ అళ్వార్ తిరుమంజన సేవలో పాల్గొంటారు. శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మంత్రులు ఆనం, అనగాని విజయవాడకు బయలుదేరివెళతారు. హోంమంత్రి అనిత మంగళవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శిస్తారు.